వెంక‌న్న‌కు జీఎస్టీ వెసులుబాటు ఇచ్చేశారు

Update: 2018-06-03 04:48 GMT
ఓట్లేసి గెలిపించ‌ట‌మే త‌ప్ప‌న్న‌ట్లుగా ఏపీ ప్ర‌జ‌ల మీద క‌సి తీర్చుకుంటున్న మోడీ స‌ర్కారు త‌న వైఖ‌రిని కాస్త మార్చుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఏపీ మీద మోడీ మాష్టారికి ఎందుకంత కోప‌మ‌న్న విష‌యంపై బీజేపీ నేత‌లు సైతం క్లారిటీ ఇవ్వ‌లేక‌పోతార‌ని చెబుతారు. ఏపీకి చెందిన ఏ విష‌యం మీద‌నైనా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యేందుకు.. నిధులు విడుద‌ల‌కు స‌సేమిరా అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే మోడీ స‌ర్కారుపై ఏపీ ప్ర‌జ‌ల్లో ఎంత‌టి ఆగ్ర‌హం ఉందో తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఏపీ స‌ర్కారు చేసే విన‌తుల్ని లైట్ తీసుకునే కేంద్రం ఈసారి అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించి ఏపీ ప్ర‌జ‌ల మ‌న‌సుల్ని దోచుకునే ప్ర‌య‌త్నం చేసింది.

గ‌డిచిన కొంత‌కాలంగా తిరుమ‌ల వెంక‌టేశుడికి సంబంధించి జీఎస్టీ మిన‌హాయింపులు ఇవ్వాల‌ని కేంద్రాన్ని ఏపీ ప్ర‌భుత్వం కోరుతోంది. అయితే.. దీనిపై మోడీ స‌ర్కారు నుంచి ఎలాంటి స్పంద‌న రాలేదు. ఒక ద‌శ‌లో ఏపీ రాష్ట్ర స‌ర్కారు ప్ర‌తిపాద‌న‌ను కేంద్రం రిజెక్ట్ చేసింది.

మారి.. ప‌రిణామాల నేప‌థ్యంలో వెంక‌న్నకు సంబంధించిన రిక్వెస్ట్ పై మోడీ స‌ర్కారు సానుకూలంగా స్పందించింది. సేవా భోజ్ యోజ‌న ప‌థ‌కం కింద భ‌క్తుల‌కు ఉచిత అన్న  ప్ర‌సాదం అందించే ఆల‌యాల‌కు జీఎస్టీ నుంచి మిన‌హాయింపులు ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణ‌యంతో టీటీడీకి ఏటా రూ.35 కోట్ల ఆదాయం స‌మ‌కూర‌నుంది.

గ‌తంలో శ్రీ‌వారిని జీఎస్టీ నుంచి మిన‌హాయింపులు ఇవ్వాల‌ని ఏపీ స‌ర్కారు అదే ప‌నిగా కోరినా రియాక్ట్ కాని మోడీ స‌ర్కారు తాజాగా మాత్రం అందుకు భిన్నంగా నిర్ణ‌యం తీసుకోవ‌టం గ‌మ‌నార్హం. ఏపీ ప్ర‌జ‌ల్లో మోడీ స‌ర్కారు మీద అంత‌కంత‌కూ పెరుగుతున్న ఆగ్ర‌హాన్ని క‌ట్ట‌డి చేసేందుకే వెంక‌న్న విష‌యంలో మోడీ స‌ర్కారు దిగి వ‌చ్చింద‌ని చెబుతున్నారు. మ‌రోవైపు..ఏపీ ప్ర‌జ‌ల్లో త‌న‌పై ఉన్న వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించుకోవ‌టానికి మోడీ స‌ర్కార్‌  శ్రీ‌వారి సెంటిమెంట్ ను  ఈ విధంగా వాడుకుంద‌న్న అభిప్రాయం వినిపిస్తోంది.
Tags:    

Similar News