ఉమ్మడి ఏపీ ఉండగా ఏ మూల నుంచి సిఫారసు వచ్చినా టీటీడీ వారికి దర్శన భాగ్యం కల్పించేది. అయితే తెలుగు రాష్ట్రాలు విడిపోయాక తెలంగాణ వారికి కాస్త ప్రాధాన్యం తగ్గింది.తెలంగాణ వారికి సరిగా దర్శనాలు కావడం లేదని ఆరోపణలు ఉన్నాయి.
తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు స్వీకరించని కారణంగా టీటీడీ అదనపు ఈవో కార్యాలయం వద్ద భక్తులు ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సులతో దర్శనాలు జారీ చేయడం దుష్ప్రచారమే అని టీటీడీ అధికారులు తెలిపారు. నిబంధనల మేరకు ప్రజాప్రతినిధులు సిఫారసు లేఖలు పరిగణలోకి తీసుకుంటున్నారని అన్నారు.
ఈ క్రమంలోనే తెలంగాణ నేతల సిఫార్సు లేఖలను తిరస్కరించినట్లు జరుగుతున్న ప్రచారంపై టీటీడీ స్పందించింది. 'ఇదంతా తప్పుడు ప్రచారం. గత వారం కొందరునేతలు కోటాకు మించి లేఖలు ఇచ్చారని.. తెలంగాణ నేతలకు కూడా గతంలో మాదిరిగానే టికెట్లు ఇస్తున్నామన్నారు. కోటాను తగ్గించలేదన్నారు. లేఖలు తిరస్కరించలేదని' టీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఒక్కో రోజు ఎక్కువ సంఖ్యలో ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖలు జారీ చేసిన సమయంలోనే తిరస్కరణ జరుగుతుందని టీటీడీ తెలిపింది. కొందరు ప్రజాప్రతినిధుల విజ్ఞాపన మేరకు వారి సిఫారసు లేఖలపై ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను మంజూరు చేశామని టీటీడీ అధికారులు తెలియజేశారు. దీంతో ఈ వివాదానికి పుల్ స్టాప్ పడినట్టైంది.