తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల23 వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అసెంబ్లీలో పాలకపక్షాన్ని నిలదీసేందుకు తెలు గుదేశం పార్టీ సమాయతయత్తమవుతోంది. అయితే రానున్న సమావేశాలలో గతంలోకన్నా భిన్నంగా వ్యవహరించాలని టీటీడీపీ నిర్ణయానికి వచ్చింది. అసెంబ్లీలో పాలకపక్షమైన తెలంగాణ రాష్ట్ర సమితి ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, గత సమావేశాలలో ప్రజా సమస్యలపై నిలదీసిన తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా భావించి మాట్లాడే హక్కును హరించిందని టీడీపీ భావిస్తోంది. పార్టీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ల వేటు వేసిందని, టీడీఎల్పీ ఉప నేత రేవంత్ రెడ్డిని కూడా అకారణంగా సమావేశాలు ముగిసే దాకా సభ నుంచి వెలివేయడం సభా హక్కులను ఉల్లంఘించడమేనని టీటీడీపీ బలంగా నమ్ముతోంది. అయితే గత అనుభవాలను దృష్టిలో వుంచుకునే తెలుగుదేశం ఈసారి సింగిల్ గా వెళ్లకూడదని డిసైడయింది. శాసనసభ వేదికగా పోరాడే క్రమంలో అన్ని పార్టీలను కలుపుకుపోవాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది.
తెలంగాణ అసెంబ్లీలో అన్ని ప్రతిపక్ష పార్టీలకు అసెంబ్లీలో గణనీయమైన సంఖ్యా బలం వుంది. కానీ అసెంబ్లీ సమావేశాలలో వివిధ సమస్యలపై ఎవరికి వారే చందంగా వ్యవహరిస్తుండటం టీఆర్ ఎస్ కు మంచి అవకాశంగా లభించిందనే అభిప్రాయం టీటీడీపీ తో పాటు ఇతర అన్ని పార్టీలలో నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో అన్ని పక్షాలకు ఉమ్మడి టార్గెట్ అయిన టీఆర్ ఎస్ ను ఎదుర్కునేందుకు కలిసికట్టుగా వెళ్లాలని తెలంగాణ తమ్ముళ్లు భావిస్తున్నారు. టీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చిన ఏడాదికాలం పాటు వేచి చూసే ధోరణిని అవలంభించిన కాంగ్రెస్ సైతం హైకమాండ్ దూకుడుగా ముందుకువెళ్లాలని పార్టీనాయకులకు సూచించింది. టీపీసీసీ కొత్త కార్యవర్గం వచ్చిన అనంతరం పాలకపక్షాన్ని ఎండగట్టే కార్యక్రమాలు ఉదృతమయ్యాయి. ఈ నేపథ్యంలో టీఆర్ ఎస్ దుందుడుకు ధోరణిని సమష్టిగా ఎదుర్కోవాలనే యోచనలో కాంగ్రెస్ నాయకత్వం సైతం వుంది. ఇంతవరకు తెలంగాణ తెలుగు దేశం పార్టీ సభ్యులను ఇరకాటంలోకి నెట్టితే తమకేవీ పట్టనట్టుగా కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలు వ్యవహరించేవి. అయితే ఈసారి అలాంటి పరిస్థితులు పునరావృతం కాకూడదనేది టీటీడీపీ వ్యూహంగా పెట్టుకుంది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీల శాసనసభా పక్ష నేతలతో సంప్రదింపులు జరుపుతున్న తెలుగుదేశం ఉమ్మడి కార్యాచరణను రూపొందించేదిశగా కసరత్తు ప్రారంభించింది.
ఈ నేపథ్యంలోనే రైతుల ఆత్మహత్యలు - తెలుగుదేశం - కాంగ్రెస్ - వైఎస్సార్ సీపీ పార్టీల నుంచి ఎమ్మెల్యేల ఫిరాయింపులు, నష్టపరిహారం వంటి సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలనే నిర్ణయాలపై ఏకాభిప్రాయం వస్తే కార్యాచరణను పకడ్బందీగా అమలు చేయాలని చూస్తున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తేదీ నుంచి ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు ఆరు లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని,లేనట్లయితే మరో పోరాటానికి తాము సిద్దం అనే సంకేతాలను తెలంగాణ తెలుగు దేశం పార్టీఇచ్చింది. పాత ఇళ్లను పూర్తి చేయడంతో పాటు కొత్తగా డబుల్ బెడ్ రూం పథకాన్ని తక్షణమే అమలు చేయాలని, ప్రాజెక్టులపై అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది. అసెంబ్లీ వేదికగా అన్ని ప్రతిపక్ష పార్టీలను కలుపుకుపోయే ప్రయత్నాలలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టే విధంగా మొత్తం 29 అంశాలను ప్రాతిపదికగా ఎంచుకుంది. ఈ మేరకు ఆ పార్టీ శాసనసభ్యులకు ఇటీవల అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన సమావేశంలో దిశానిర్దేశం చేసింది.