వజ్రాల వ్యాపారి హత్య కేసులో ముంబయి పోలీసులు ఓ రాజకీయ నాయకుడిని అరెస్టు చేయడంతో పాటు మోడల్ - ప్రముఖ టీవీ నటి దేవోలీనా భట్టాచారి(28)ని నిర్బంధించారు. రాజేశ్వర్ ఉదానీ(57) అనే వజ్రాల వ్యాపారి అనుమానాస్పదరీతిలో మృతిచెందాడు. ఇతడి మృతదేహాన్ని రాయ్ ఘడ్ జిల్లా అటవీ ప్రాంతంలో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు వ్యాపారికి రాజకీయ నాయకుడు సచిన్ పవార్ తో దగ్గరి సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. సచిన్ పవార్ మహారాష్ట్ర మాజీ మంత్రి ప్రకాశ్ మెహతాకు అనుచరుడు. అదేవిధంగా గ్లామర్, ఎంటర్ టైన్ మెంట్ పరిశ్రమలోని మహిళలతో తరచుగా టచ్‌లో ఉండేవాడని కాల్ డేటా ఆధారంగా తేలింది. దీంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
వజ్రాల వ్యాపారి హత్య కేసులో పోలీసులు నటి దేవోలీనా భట్టాచార్జిని కొన్ని గంటల పాటు విచారించారు. అంతేకాకుండా సినీ - మోడల్ రంగానికి చెందిన పలువురు మహిళలను విచారించనున్నట్లు పోలీసులు వెల్లడించారు. వ్యాపారి రాజేశ్వర్ నవంబర్ 28న కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.అతడి డ్రైవర్ చెప్పిన వివరాల ప్రకారం... రాజేశ్వర్ ఉదాని తనను పంత్‌నగర్ మార్కెట్ ఏరియాలో డ్రాప్ చేయమని చెప్పారని - అక్కడి నుంచి వేరే వాహనంలో వెళ్లారని పోలీసులు గుర్తించారు. ఈ కేసుతో సంబంధమున్న దినేశ్ పవార్ అనే సస్పెండెడ్ పోలీసు కానిస్టేబుల్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. అతడు ఇచ్చిన సమాచారంతో టీవీ నటి దేవొలీనాను అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేయగా అటవీ ప్రాంతంలో వ్యాపారి మృతదేహాన్ని కనుగొన్నారు.
మృతదేహం వద్దనున్న ఆనవాళ్ల ప్రకారం అతడిని కిడ్నాప్ చేసిన వారు ఒక ప్రదేశంలో చంపేసి పాన్ వెల్ అడవిలో మృతదేహాన్ని వదిలి వెళ్లినట్లు భావిస్తున్నారు. ఫోన్ డాటా చెక్ చేసిన పోలీసులకు రాజేశ్వర్ రెగ్యులర్ గా కొన్ని బార్లకు వెళ్లేవాడని - గ్లామర్ - ఎంటర్టెనింగ్ రంగానికి చెందిన మహిళలతో సంబంధాలు ఉండేవని, సచిన్ పవార్ ద్వారా అతడు వారిని కలిసేవాడని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో సినీ - టీవీ పరిశ్రమకు చెందిన మరికొందరు మహిళల హస్తం ఉందని తెలుస్తోంది.