ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో కుల ఉద్యమ సెగ తగలబోతోంది. విచిత్రంగా... ఆ ఉద్యమానికి కర్త - కర్మ - క్రియగా టీడీపీ నేతే వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు తీరుతో విసిగిపోయిన ఆ టీడీపీ సీనియర్ త్వరలో భారీ సభ నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. కాపు ఉద్యమ సెగ మొదలైన తూర్పు గోదావరి జిల్లాకు పొరుగునే ఉన్న... చంద్రబాబుకు అత్యంత ప్రీతికరమైన జిల్లా అయిన పశ్చిమగోదావరికి చెందిన మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు ఈ ఉద్యమానికి పునాదులేస్తుండడంతో టీడీపీలో కలవరం మొదలైంది.
కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు చంద్రబాబు తీరుపై మండిపడుతున్నారు. తనకు సీఎం తీవ్ర అన్యాయం చేశారని వాపోయారు. తిట్టిన వారికి - విమర్శించిన వారికే చంద్రబాబు పదవులు ఇస్తున్నారని విమర్శించారు. ఒకప్పుడు చంద్రబాబును తీవ్రంగా తిట్టిన జూపూడి ప్రభాకర్ కు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ - కారెం శివాజీకి ఎస్సీఎస్టీ కమిషన్ చైర్మన్ పదవులు కట్టబెట్టారని… ఎంతోకాలంగా పార్టీ నమ్ముకుని ఉన్న తనకు మాత్రం తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు.
తనకు ఆర్టీసీ చైర్మన్ పదవి ఇవ్వాలని రామారావు డిమాండ్ చేశారు. లేకుంటే డిసెంబర్ 10న విజయవాడలో మాదిగ మేధావుల సదస్సు నిర్వహించి సత్తా ఏమిటో చూపిస్తానని రామారావు హెచ్చరించారు. రామరావు అసంతృప్తి కుల ఉద్యమంగా రూపుదాల్చితే ఇబ్బందేనని టీడీపీ నేతలు అంటున్నారు. మరి.. చంద్రబాబు ఇంకో తలనొప్పి తెచ్చుకుంటారో్ లేదంటే రామారావును బుజ్జగిస్తారో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/