ట్విట్టర్ సీఈవోకు ల్యాప్ టాప్ లేదట..

Update: 2018-05-28 23:30 GMT
ప్రపంచంలోనే పెద్ద సోషల్ మీడియా దిగ్గజానికి ఆయన సీఈవో.. టెక్నాలజీని అందిపుచ్చుకునే సంస్థను నడిపిస్తూ ఆయనకు సొంత ల్యాప్ టాప్ లేదంటే నమ్ముతారా.? కానీ ఇది నిజం.. ట్వి్టర్ సీఈవోగా పనిచేస్తున్న జాక్ డోర్సే వద్ద సొంత ల్యాప్ టాప్ లేదు. 2015లో జాక్ డొర్సే రెండోసారి ట్విట్టర్ గా ఎంపికయ్యారు.  తాను ల్యాప్ టాప్ ను వాడనని ఆయనే స్వయంగా వెల్లడించడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. కేవలం ట్విట్టర్ కంపెనీని నిర్వహించడమే కాకుండా తన డిజిటల్ జీవితాన్ని తగిన విధంగా బ్యాలెన్స్ చేసుకుంటూ పలువురు మన్ననలు పొందుతున్న జాక్  ఓ ఇంటర్వ్యూలో  చెప్పిన విషయాలు తాజాగా హాట్ టాపిక్ అయ్యాయి.

మరి ల్యాప్ టాప్ వాడకుండా ఇంటర్నెట్ పనులన్నీ ఎలా చక్కబెడుతాడనే డౌట్ మీకు రావచ్చు.. అందుకు ఆయన చెప్పిన కారణం ఏంటో తెలుసా.? ఆయన తన మొబైల్ ఫోన్ నే ల్యాప్ టాప్ మాదిరిగా ఉపయోగిస్తారట.. తాను ల్యాప్ టాప్ వాడనని.. ప్రతీది తన ఫోన్ ద్వారానే నిర్వహిస్తానని చెప్పారు. తన సొంత ఆన్ లైన్ సెక్యూరిటీ ప్రాక్టీస్ విషయాలపై మాట్లాడుతున్న సమయంలో డోర్సే ఈ విషయాలను వెల్లడించారు. ల్యాప్ ట్యాప్ పై ఒకేసారి అన్ని చేయడం కంటే ఇదే బెస్ట్ అని చెప్పారు. నోటిఫికేషన్లలన్నీ ఆపివేసి ఒక సమయంలో ఒక పనిని మాత్రమే చేస్తానన్నారు.  

ల్యాప్ టాప్ లాగా ఫోన్ ను వాడడానికి పలు వాయిస్ టైపింగ్ టూల్స్ ఉన్నాయన్నారు జాక్.. ప్రైవసీ, సెక్యూరిటీ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు వహించాలని.. మీ డేటాను సురక్షితంగా ఉంచుకోవడానికి మీ వద్ద ఉన్న కంపెనీ డేటాకు రక్షణ కలిగించడానికి అవసరమైన టూల్స్ గురించి తెలుసుకొని ఫోన్ తో అన్నీ పనులు చేయవచ్చని సూచించారు.
Tags:    

Similar News