రెడ్ లైట్ ఏరియాలపై పోలీసులు కొరడా ఝులిపించంతో అనూహ్య పరిణామం ఎదురైంది. రాజాస్తాన్ లోని భరత్ పూర్ లో గల కోలాదేవ్ జాతీయ పార్క్ సమీపంలోని రెడ్ లైట్ ఏరియాపై పోలీసులు రైడ్ చేశారు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు సోదాలను చేపట్టారు. అయితే రెడ్ లైట్ ఏరియా నుంచి పారిపోయే క్రమంలో ఇద్దరు మైనర్ బాలికలు ఓ చెరువులో పడి చనిపోయారు. మరొకరిని పోలీసులు కాపాడారు. ఈ విషాద సంఘటన ఒకరోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కేసు వివరాలను భరత్ పూర్ రేంజ్ ఐజీ అలోక్ వశిష్ట తెలుపుతూ.. సోదాల్లో మూడు పోలీసు బృందాలు పాల్గొన్నాయన్నారు. పదుల సంఖ్యలో విటులను - వేశ్యలను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. రైడ్ సమయంలో వీరిని అదుపులోకి తీసుకునే క్రమంలో పారిపోయేందుకు యత్నించి ముగ్గురు యువతులు చెరువులో దూకినట్లు వెల్లడించారు. ఈత రాకపోవడంతో ఇద్దరు చనిపోగా మరొకరిని పోలీసులు కాపాడారని వివరించారు. వ్యభిచార రాకెట్ ను అరికట్టడమే తమ లక్ష్యంగా రైడ్ లు చేపడుతున్నట్లు వశిష్ట తెలిపారు. కాగా నిజానిజాలు తెలుసుకోకుండా పోలీసులు బాలికలను కొట్టారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఎటువంటి విచారణ చేయకుండా వచ్చిరావడంతోనే అక్కడ ఉన్న బాలికలను నిర్భందించి వేధింపులకు గురిచేశారని మండిపడ్డారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/