అమెరికాలో భారతీయులు వరసగా హత్యలకు గురవుతున్నారు. ఇటీవల జరిగిన హత్యాకాండలను మరవక మునుపే తాజాగా మరో భారతీయ మహిళ కాలిఫోర్నియాలో హత్యకుగురైంది. ఈమె మరణం అత్యంత అనుమానాస్పద రీతిలో జరిగింది. ఇప్పటి వరకూ ఎలా మరణించిందనే అంశం గురించి మిస్టరీ వీడడం లేదు.
రణధీర్ కౌర్(37) అనే ఈ మహిళ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో దంతవైద్య విద్యను అభ్యసిస్తోంది. అక్కడే ఒంటరిగా ఫ్లాట్‌లో నివస్తుంటుంది. ఈ నెల ఎనిమిద తేదీన ఆమె తన ఇంటిలోనే విగతజీవిగా పడి ఉంది.
ఈ విషయాన్ని గుర్తించిన పొరుగువారు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఆమె తలలో బుల్లెట్ దిగి మరణించిందని ధ్రువీకరించారు. అయితే సమీపంలో ఎక్కడా గన్ కనిపించడం లేదు.. దీంతో ఇది కచ్చితంగా హత్యేనని పోలీసులు నిర్ధారించారు.
కానీ రూమ్‌లో ఆమె హత్యకు మునుపు ఎటువంటి పెనుగులాట జరిగిన దాఖలాలూ లేవు. దుండగులో, రేపిస్టులో ఈ పని చేశారనడానికి ఎటువంటి రుజువులూ లభించడం లేదు. ఈ నేపథ్యంలో కౌర్ మరణం ఒక మిస్టరీగా మారింది. ఆమె వ్యక్తిగత వస్తువులను.. ఆమెను ఎరిగిన వారిని విచారించినా కూడా ఇంత వరకూ క్లూ దొరకలేదని పోలీసులు తెలిపారు.
అయితే ఈ కేసు గురించి ముమ్మరంగా ధర్యాప్తు చేస్తున్నామని వారు ప్రకటించారు. మరి విదేశంలో ఇలా ఎన్‌ఆర్‌ఐలు హత్యలకు గురవుతుండటం అత్యంత ఆందోళన కలిగించే అంశమే.