ఉద్దవ్ అలా చేయనందుకే సీఎం పదవి దక్కలేదా?

Update: 2019-11-10 09:17 GMT
గుడికి వెళ్లి మొక్కకుంటే చాలు.. తాము కోరుకున్నది దేవుడు ఇచ్చేస్తారన్న నమ్మకం.. విశ్వాసం ఉన్నోళ్లు చాలామందే కనిపిస్తారు. శివసేన చీఫ్ కూడా ఆ కోవకు చెందిన వారే. తాను చేసిన పూజ ఎఫెక్ట్ ఎంత ఎక్కువన్న విషయాన్ని ఆయన మాటలతో భలేగా చెప్పేశారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈ తీర్పుపై భలే సంతోషంగా ఉన్న ఉద్దవ్.. ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. గత ఏడాది నవంబరు 24న అయోధ్యలో పర్యటించాలనని.. ఈ సందర్భంగా అయోధ్యలో ప్రార్థనలు చేసిన ఆయన.. సరయూ నది ఒడ్డున హారతిలోనూ పాల్గొన్నట్లు చెప్పారు. రామమందిర నిర్మాణంలో ఏదైనా అద్భుతం జరగాలని తాను ప్రార్థించినట్లు చెప్పారు.

తన ప్రార్థనలు ఫలించి.. అద్బుత ఫలితం వచ్చినట్లు ఆనందపడుతున్నారు. అంతా బాగుంది కానీ ఉద్దవ్.. అయోధ్యలో రామాలయానికి సంబంధించి అద్భుతం జరగాలనుకున్నారు సరే.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహారాష్ట్ర సీఎం సీటు పార్టీకి దక్కాలని ఎందుకు కోరుకోలేదు? ఇవాల్టి రోజున సీఎం సీటు ముఖం చాటేయటానికి కారణం.. గత ఏడాది గట్టిగా ప్రార్థించకపోవటమేనంటారా? మరి..ఈ నవంబరు 24న అయోధ్యకు మళ్లీ వెళతానంటున్న ఉద్దవ్.. ఈసారైనా సీఎం పోస్టు కోసం గట్టిగా ప్రార్ధిస్తే బాగుంటుందేమో?
Tags:    

Similar News