అత్యంత భద్రత కలిగిన ముఖ్యమంత్రినే బెదిరించే స్థాయికి వచ్చారంటే వారెంత పవర్ ఫుల్లో అర్థం చేసుకోవచ్చు. వారే మాఫియా డాన్ దావూద్. అవును ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి, అంతర్జాతీయ ఉగ్రవాది దావూద్ గ్యాంగ్ తాజాగా ఏకంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేనే బెదిరించడం సంచలనమైంది.
సీఎంలతో పెట్టుకుంటే శాల్తీలే లేచిపోయే ఈరోజుల్లో కూడా ఏకంగా సీఎంనే దావూద్ గ్యాంగ్ టార్గెట్ చేయడం సంచలనమైంది. తాజాగా ముంబైలోని సీఎం ఉద్దవ్ నివాసం మాతోశ్రీని పేల్చేస్తామంటూ దావూద్ గ్యాంగ్ బెదిరింపులకు పాల్పడింది. దీంతో పోలీసులు మాతోశ్రీ దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దుబాయ్ నుంచి ఉద్దవ్ కు మూడు సార్లు ఫోన్ కాల్స్ రావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా అలెర్ట్ అయ్యింది.
కాగా దుబాయ్ నుంచి వచ్చిన కాల్స్ కు శివ సైనికులు భయపడరని.. దీనికి బాధ్యులైన వారిని విడిచిపెట్టేది లేదని మహారాష్ట్ర హోంమంత్రి శంభురాజే దేశాయ్ ప్రకటించారు. ముంబై పోలీసులు ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి దర్యాప్తును మొదలుపెట్టింది. కాల్స్ లోకేషన్ ను ట్రేస్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ముంబైలో మళ్లీ దావూద్ గ్యాంగ్ యాక్టివ్ కావడం కలకలం రేపుతోంది.