రేపే ఉగాది.. కరోనాతో కళతప్పిన పండుగ

Update: 2020-03-24 14:30 GMT
ఉగాది.. తెలుగు వారి స్వచ్ఛమైన పండుగ.. తెలుగు వారి కొత్త సంవత్సరాది కూడా.. ఇప్పటి నుంచి మన తెలుగు పండుగలు, నెలలు మొదలవుతాయి. ఈ అచ్చతెలుగు పండుగ వచ్చిదంటే చాలు.. మామిడి తోరణాలు.. ఇళ్లంతా కడిగి కల్లాపి చల్లి, పసుపు పెట్టి.. వేప పువ్వు, కొత్త చింతపండు , మామిడి కాయలను తీసుకొచ్చి కొత్తకుండలో వేసి పచ్చడి తయారు చేసుకొని తాగేవాళ్లం.. బచ్చాలు, బూరెలు చేసుకొని తినేవాళ్లం.. కానీ ఇప్పుడు కరోనా కారణంగా పండుగ కళతప్పింది. అసలు రేపే ఉగాది అయినా ఆ పండుగ వాతావరణమే తెలుగు లోగిళ్ల లో లేదంటే అతిశయోక్తి కాదు.

ప్రస్తుతం దేశంలో కరోనా కారణంగా లాక్ డౌన్ ప్రకటించారు.అందరినీ ఇళ్లలోనే ఉండమన్నారు. దీంతో మార్కెట్లు అన్నీ బోసిపోయాయి. ఉగాదికి సంబంధించిన మామిడికాయలు, వేపపువ్వు, చింతపండు, ఇతర సామగ్రి కొనుగోళ్లే లేకుండా పోయాయి. ఎవరి ఇంట్లో వారున్నారు. పట్టణాల్లో అయితే మరీ ఘోరం.. గ్రామాల్లో కాస్తంతా వెసులుబాటు ఉండి చెట్లకు ఆకులు, పండ్లు తెంపుకొని ఈ పండుగ చేసుకుంటున్నారు.

రేపే ఉగాది ఉన్నా కరోనా భయంతో ఇప్పుడు ఎవరూ ఇళ్లు విడిచి బయటకు రావడం లేదు. దీంతో తెలుగువారి పండుగ కళతప్పింది. కరోనా వైరస్ వల్ల పండుగనే లేకుండా పోయింది. వస్తువులు , పదార్థాలు కొనే వీలు లేకుండా పోతుండడంతో ఎక్కడివాల్లు అక్కడే ఇంట్లోనే ఉంటున్నారు.

ప్రస్తుతం కరోనా నుంచి బయటపడేందుకే జనం యోచిస్తున్నారు. ఆ భయంలోనే బతుకుతున్న పరిస్థితి నెలకొంది. అంతేతప్ప ఉగాది వచ్చిందని పండుగ చేసుకునే మూడ్ లో లేరు. సో తొలిసారి తెలుగు వారి పండుగ ఉగాది కళతప్పింది.
Tags:    

Similar News