రష్యా, ఉక్రెయిన్ యుద్ధం.. బైడెన్ కుర్చీకి ఎసరు..?

Update: 2022-02-26 13:30 GMT
ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధం.. ప్రపంచమంతా చర్చనీయాంశంగా మారింది. ఉక్రెయిన్ పై దాడి ఆపాలంటూ రష్యాను  ప్రపంచ దేశాల  ప్రజలు వేడుకుంటున్నారు. కొందరు ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా  అమెరికాలోని ప్రజలు రోడ్డుమీదకు వచ్చి రష్యాకు వ్యతిరేకంగా నినాదాలు  చేస్తున్నారు. అయితే రష్యా మాత్రం ఎవరి మాట వినడం లేదు. తన పని తాను చేస్తోంది.  ఇదిలా ఉండగా రష్యా దూకుడుతో అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ కుర్చీకి ఎసరు పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రష్యాకు బైడెన్ భయపడుతున్నారంటూ ప్ల కార్డులు పట్టుకొని నినదిస్తున్నారు. అంతేకాకుండా బైడెన్ దిగిపో.. అంటూ నినాదాలు చేస్తున్నారు. అంతేకాకుండా బైడెన్  కంటే ట్రంపే నయమని కొందరు వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ ఆది నుంచి ఉక్రెయిన్ కు మద్దతు ఇస్తామంటూ ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. కానీ అత్యవసర సమయంలో చేతులెత్తేశారు. ఉక్రెయిన్ నాటో సభ్యత్వ దేశం కాదని, అందువల్ల మేమేం  చేయలేమని అన్నారు. దీంతో అమెరికన్ల ప్రజల ఆగ్రహానికి గురవుతున్నారు. ఉక్రెయిన్ కు మద్దతుగా నినాదాలు చేస్తున్నారు. రష్యాకు ఎదురు తిరిగాల్సిందిపోయి.. భయపడుతున్నారని అంటున్నారు.  రష్యాకు భయపడే బైడెన్ తక్షణమే  గద్దె దిగిపోవాలని అంటున్నారు. ఒక్క అమెరికన్లే కాదు ఉక్రెయిన్ మద్దతే దేశాలన్నింటిలోనూ ఇవే ఆందోళనలను కొనసాగుతున్నాయి. అయితే ఆందరి టార్గెట్ బైడెన్ కావడం గమనార్హం.

అయితే నాటో సభ్యత్వ దేశాలపై రష్యా దాడి చేస్తే స్పందిస్తామంటున్నారు బైడెన్. ఉక్రెయిన్ పై దాడి చేస్తున్న రష్యా నాటో సభ్య దేశాలపై దూసుకు రాకుండా అపుతున్నామని, ఇందులో భాగంగానే రష్యాపై ఆంక్షలు విధించామన్నారు. ఒకవేళ పుతిన్ నాటో సభ్య దేశాలపై వెళ్తే మేం జోక్యం చేసుకుంటామన్నారు.  ‘నేను చెప్పేదేంటంటే పుతిన్ కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలి. లేకపోతే అతనికి మరింత ధైర్యం పెరుగుతుంది’ అని అన్నారు. అందుకే రష్యాపై ఆంక్షలు కఠినతరం చేస్తున్నామన్నారు. ఈ సమయంలో తూర్పు ఐరోపా దేశాలకు బలగాలను పంపితే మరింగ ఘర్షణ వాతావరణం ఏర్పడుతుందన్నారు.

నాటో దేశాలు గతంలో ఎన్నడూ లేనంతగా ఐక్యంగా ఉన్నాయని, ఈ సమయంలో పుతిన్ తో మాట్లాడే అవసరం తనకు లేదన్నారు. పుతిన్ సోవియట్ రష్యాను స్థాపించాలని ప్రయత్నిస్తున్నాడన్నారు. ప్రపంచంలోని ఇతర అధినాయకుల ఆలోచనకు, పుతిన్ ఆలోచనలు భిన్నంగా ఉన్నాయన్నారు. అయితే నాటో సభ్య దేశాల రక్షణకు అమెరికా అదనపు బలగాలను పంపేందుకు రెడీగా ఉందన్నారు. నాటో దేశాలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. నాటో లోని 30 దేశాలను సంఘటితం చేసి తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామన్నారు.

అయితే బైడెన్ చేసిన ఈ వ్యాఖ్యలపై సర్వత్రా వ్యతికేత ఏర్పడుతోంది. అమెరికాలోని కొందరు ‘ఇంత దురదృష్టకరమైన అధ్యక్షుడిని మేం ఎప్పుడూ చూడలేదు’ అని వ్యాఖ్యానిస్తున్నారు. ఓ చిన్న దేశం ఉక్రెయిన్ పై రష్యా దాడి చేస్తుంటూ కాపాడాల్సింది పోయి మాటలతో కాలం వెళ్లదీస్తున్నారంటున్నారు. కొందరు ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తే మరికొందరు సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తి పోస్తున్నారు. ‘ఇది గుడ్డి పాలన.. అంధ నిర్ణయాలకు వేదిక’ అంటూ పోస్టులు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. అటు మిగతా దేశాల్లోనై బైడెన్ అధ్యక్ష పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా కొందరు మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఉంటే నిర్ణయాలు వేరే ఉండేవని అంటున్నారు. కఠిన నిర్ణయాలు తీసుకునే ట్రంప్ ను అనవసరంగా ఓడగొట్టుకున్నామని వ్యాఖ్యానిస్తున్నారు. కొన్ని చోట్ల ప్ల కార్డులపై ట్రంఫ్ పేర్లతో నినాదాలు కనిపించడం గమనార్హం. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఇప్పుడు అమెరికా అధ్యక్ష పీఠానికే ఎసరు పడడం చర్చనీయాంశంగా మారింది. అయితే బైడెన్ ఈ సమస్య నుంచి ఎలా బయటపడుతాడో చూడాలంటున్నారు.
Tags:    

Similar News