ఉక్రెయిన్ మహిళలను వ్యభిచారంలోకి దింపుతున్న ముఠాలు

Update: 2022-03-30 03:30 GMT
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ఎన్నో విషాధాలను మిగుల్చుతోంది.ప్రజలు పొట్ట చేతుల్లో పట్టుకొని పక్కదేశాలకు పారిపోతున్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు ఉక్రెయిన్ దాటి సరిహద్దుల్లోని దేశాలకు వెళుతున్నారు. ఇళ్లు, ఆస్తులు, భవనాలు వదలుకొని కట్టుబట్టలతో వెళుతున్న మహిళలు ప్రాణాలు కాపాడుకునేందుకు తరలిపోతున్నారు. డబ్బులు చేతుల్లో లేని ఈ వేళలో వారి అసహాయతను ఆసారాగా చేసుకొని కొన్ని ముఠాలు వారిని వ్యభిచార రొంపిలోకి దింపుతున్నాయి.

యుద్ధం నేపథ్యంలో దోచుకుంటున్న వారికి దోచుకున్నంత అన్నట్లుగా ఉక్రెయిన్ లో పరిస్థితి తయారైంది. తాజాగా మరో వార్త ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది.

భర్త, భార్య, తల్లిదండ్రులు ఎవరు ఎక్కడుంటున్నారో తెలియకుండా చెట్టుకొకరు.. పుట్టకొకరు చిన్నాభిన్నం అయిపోతున్నారు. ఇదే అదునుగా కొందరు ఖంత్రీగాళ్లు బయలుదేరారు. ఉక్రెయిన్ వీడుతున్న అందమైన అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారు. ఇప్పటికే కోటి మంది ఉక్రెయిన్ వాసులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఇలాంటి వారంతా ఎవరో తెలియని వారి చెంతకు చేరుతున్నారు. వాళ్లు ఏం చెబితే అదే చేస్తున్నారు. ఇలాంటి వారిలో ఎక్కువగా అమ్మాయిలే ఉంటున్నారు.

ముఖ్యంగా మహిళలు, యువతుల పరిస్థితి దారుణంగా ఉంది. ఆశ్రయం కల్పిస్తామన్న పేరుతో కొందరు కేటుగాళ్లు అమ్మాయిలను చేరదీసి వారిని సెక్స్ రొంపిలోకి దింపుతున్నారు. తద్వారా సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయం విస్మయానికి గురిచేస్తోంది. రష్యా దాడులతో మహిళలను చూసి జాలి చూపించాల్సిన ఈ కేటుగాళ్లు  వాళ్ల శరీరంతో సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయం షాకింగ్ గా మారింది.

ఉక్రెయిన్ సరిహద్దుల్లో వలంటీర్ల ముసుగులో అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నట్టు తేలింది. ఆపై వారిని వ్యభిచార రొంపిలోకి దింపి సొమ్ము చేసుకుంటారని సమాచారం. వాలంటీర్ల ముసుగులో ఉన్న కొందరు పురుషులు స్విట్జర్లాండ్ లో ఆశ్రయం కల్పిస్తామని చెప్పి వారిని ఓ వ్యాన్ లో తీసుకెళుతున్నారు. ఒక మహిళా గట్టిగా నిలదీయడంతో ఈ విషయం వెలుగుచూసింది. ఇప్పటికే డబ్బుల కోసం మహిళలు  ఈ ముఠాలకు లొంగి వ్యభిచార కూపంలోకి దిగారు. వెంటనే ఐక్యరాజ్యసమితి సహా ప్రజా సంఘాలు ఉక్రెయిన్ మహిళలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Tags:    

Similar News