వైసీపీ ఏపీలో సునామీ సృష్టించింది.. అఖండ మెజార్టీని సాధించింది. 2014 ఎన్నికల్లో కాపులంతా టీడీపీ వెంట నడవడంతో ఆ పార్టీ మెజార్టీ సీట్లను సాధించింది. కానీ ఈసారి మాత్రం బాబు చేసిన మోసానికి రగలిపోయిన కాపు సామాజికవర్గం అంతా వైసీపీకే జైకొట్టారు. దీంతో బలమైన కాపు ఓటు బ్యాంకును అలానే ఉంచడంపై జగన్ కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది.
2014లో చంద్రబాబు గెలవగానే డిప్యూటీ సీఎంగా కాపు సామాజికవర్గానికి చెందిన నిమ్మకాయల చిన్నరాజప్పను ఎంపిక చేశారు. తమకు ఓటేసిన కాపులకు ఇలా సంతృప్తిపరిచారు. దీంతో ఇప్పుడు జగన్ కూడా అశేషంగా ఉన్న కాపు సామాజికవర్గానికి డిప్యూటీ సీఎం పదవి ఇస్తారనే చర్చ వైసీపీలో సాగుతోంది.
ఇక జగన్ ఏపీ ప్రభుత్వంలో ఫస్ట్.. మరి సెకండ్ ఎవరు? జగన్ తర్వాత ప్రభుత్వంలో నంబర్ 2 పోస్టు ఎవరిదనే ప్రశ్న తలెత్తుతోంది. అదే డిప్యూటీ సీఎం పోస్టు. ఆ పోస్టుకు ఇప్పుడు వైసీపీలో వినిపిస్తున్న ఏకైక పేరు.. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు.. గోదావరి - గుంటూరు - కృష్ణా జిల్లాల్లో బలంగా ఉన్న కాపు ఓటుబ్యాంకును పదిలపరుచుకోవడానికి జగన్ సీనియర్ నేత అయిన ఉమ్మారెడ్డికి డిప్యూటీ సీఎం ఇస్తారనే చర్చసాగుతోంది.
వైసీపీలో సీనియర్ నేత ఉమ్మారెడ్డి. జగన్ ఏ ప్రెస్ మీట్ పెట్టినా పక్కనే ఉమ్మారెడ్డి ఉంటారు. పైగా ఆయన కాపు సామాజికవర్గం. అందుకే జగన్ తర్వాత రెండో ముఖ్య పదవి అయిన డిప్యూటీ సీఎం పోస్టును ఉమ్మారెడ్డికి ఇస్తే ఒకదెబ్బకు అటు సీనియర్ కు గౌరవంతోపాటు కాపులను సంతృప్తి పరచవచ్చని జగన్ యోచిస్తున్నారు. అందుకే ఇప్పుడు ఉమ్మారెడ్డిని డిప్యూటీ సీఎం చేస్తారా లేదా అన్న చర్చ వైసీపీలో సాగుతోంది.