ఓటుకు నోటు కేసులో చంద్రబాబు చేసింది ముమ్మాటికీ తప్పేనని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ కోర్టులో చేసిన ఫిర్యాదులో మళ్లీ కదిలిన ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు చంద్రబాబుపై విమర్శల వర్షం కురిస్తున్నారు. చంద్రబాబు తప్పు చేశారని... లేకుంటే హైకోర్టు కు స్టే కోసం ఎందుకు వెళ్తారని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు తప్పు చేశారు కాబట్టే విచారణ జరగకుండా ఆపించే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ ... ఈ కేసుకు సంబంధించి తనకు ఇబ్బంది వస్తుందని చంద్రబాబుకు అర్థమైందని.. అయితే హైకోర్టును ఆశ్రయించడం ద్వారా తను తప్పు చేశానని ఆయనే అంగీకరించినట్లు అయ్యిందన్నారు.
గతంలో అనేక కేసుల్లో చంద్రబాబు నిలుపుదల ఉత్తర్వులు తెచ్చుకున్నారని... చంద్రబాబు చరిత్రంతా స్టేలు తెచ్చుకోవడంలోనే ఉందని ఉమ్మారెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుతం ఓటుకు నోటు కేసులోనూ ఆయన అదే పని చేస్తున్నారని.. విచారణ జరిగితే వాస్తవాలు బయటపడతాయని ఉమ్మారెడ్డి అన్నారు. అందుకే విచారణ అనగానే చంద్రబాబు భయపడుతున్నారని ఆయన అన్నారు.
మరోవైపు వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ కూడా చంద్రబాబునాయుడుపై విరుచుకుపడ్డారు. విచారణ ఆపాలంటూ హైకోర్టును ఆశ్రయించడం తగదని, ఆయనకు దమ్ముంటే విచారణను ఎదుర్కోవాలని ఆమె అన్నారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఆడియో టేపుల్లో ‘మావాళ్లు.. బ్రీఫ్ డ్ మీ’ అన్న గొంతు చంద్రబాబుదేనన్న విషయం ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలిపోయిందన్నారు. చంద్రబాబు స్వయంగా మాట్లాడిన మాటలు బయటపడిన తర్వాత కూడా ఈ కేసు నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు విచారణకు సిద్ధమైతే గౌరవంగా ఉంటుందని సూచించారు.