కాలం మారింది. అభిప్రాయాలు.. అభిరుచులు మారుతున్నాయి. గతంలో మాట వరసకు కూడా మాట్లాడుకోలేని కొన్ని విషయాలు ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఒక అబ్బాయిని మరో అబ్బాయి.
ఒక అమ్మాయిని మరో అమ్మాయి ప్రేమించుకోవటం.. పెళ్లి చేసుకోవటం లాంటి అసాధారణ పెళ్లిళ్లు ఈ మధ్యన జరుగుతున్నాయి. వీటిల్లో ఎక్కువగా పెద్దల అనుమతి లేకుండా.. గుట్టుచప్పుడు కాకుండా చేసుకోవటం ఉంటుంది.
అలాంటిది ఒక కుర్రాడు.. ఒక హిజ్రా పెళ్లాడటం.. అది కూడా పెద్దలందరి అనుమతి తీసుకొని.. వారి సమక్షంలో జరగటం చాలా చాలా అరుదు.
అలాంటి అరుదైన పెళ్లికి వేదికైంది ఇల్లెందు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో తాజాగా జరిగిన పెళ్లి వేడుక హాట్ టాపిక్ గా మారింది. భూపాలపల్లికి చెందిన రూపేశ్ అనే యువకుడు.. జిల్లాలోని అనంతోగు గ్రామానికి చెందిన హిజ్రా అఖిలతో మూడేళ్ల క్రితం పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారింది. గడిచిన మూడు నెలులుగా వారిద్దరు ఇల్లెందు పట్టణంలో ఒక ఇంటిని తీసుకొని సహజీవనం చేస్తున్నారు.
తమ గురించి ఇరు కుటుంబాల వారికి సమాచారం అందించారు. తర్జనభర్జనల అనంతరం ఇరు కుటుంబాల వారు వీరిద్దరికి పెళ్లి చేసేందుకు ఒప్పుకున్నారు. దీంతో.. మామూలు పెల్లి ఏ స్థాయిలో జరుగుతుందో.. అదే స్థాయిలో వీరిద్దరి పెళ్లి ఘనంగా జరిగింది.
మామూలు పెళ్లికి ఎలా అయితే ఆహ్వానితులు వస్తారో.. ఈ పెళ్లికి వచ్చి అక్షింతలు వేసి.. భోజనాలు చేసి వెళ్లారు. కాకుంటే.. ఈ తరహా పెళ్లి ఇల్లెందులో హాట్ టాపిక్ గా మారింది.