భ్రమరావతి అనగానే భ్రమరాంబ-అమరావతి లాంటి పేర్లు కలిపినట్లుగా ఉన్నది ఈ అమ్మాయి ఎవరబ్బా అనుకుంటున్నారా? అయినా ఎవరీ అమ్మాయి.. ఈమె చంద్రబాబునాయుడును బజారు కీడ్చడం ఎలా జరుగుతుందబ్బా? అని ఆశ్చర్యపోతున్నారా? భ్రమరావతి అంటే అమ్మాయి కాదు.. ఒక పుస్తకం టైటిల్. అమరావతి అనే నగరం గురించి చంద్రబాబు చెబుతున్న సంగతుల్లో ఎన్నెన్ని భ్రమలు - అబద్ధాలు - మాయలు ఉన్నాయో చాలా విపులంగా వివరించే పుస్తకం ఇది. దీనికి చాలా సూటబుల్ గా ఉండేలా భ్రమరావతి అని టైటిల్ పెట్టారు. ఈ భ్రమరావతి పుస్తకాన్ని ఇవాళ సమైక్యాంధ్ర ఉద్యమ నాయకుడు ఉండవిల్లి అరుణ్ కుమార్ ఆవిష్కరించారు.
ఉండవిల్లి అరుణ్ కుమార్ కాంగ్రెసు పార్టీలో ఉండగా - సమైక్యాంధ్ర వాదనను బలంగా వినిపించారు. ప్రస్తుతం మాజీ అయి ఖాళీగా ఉన్నారు. కానీ తన క్రియాశీల విమర్శనాత్మక పనిని మాత్రం విడిచిపెట్టలేదు. ఈ నేపథ్యంలో.. ఆయన తొలినుంచి కూడా అమరావతి నగర నిర్మాణం గురించి చంద్రబాబు చెబుతున్న వ్యవహారాల్లో ఉన్న లోపాలను ఎత్తిచూపుతూనే ఉన్నారు. ల్యాండ్ పూలింగ్ విధానం పట్ల రైతుల్లో వ్యతిరేకత వస్తున్న సమయంలో కూడా కొన్ని సార్లు అమరావతి ప్రాంతంలో పర్యటించి.. రైతుల అభిప్రాయాలను - సాధకబాధకాలను ఆయన స్వయంగా తెలుసుకున్నారు.
తాజాగా అమరావతి పేరుతో చంద్రబాబు ఎంత మాయ చేస్తున్నాడో ఉండవిల్లి తన భ్రమరావతి పుస్తకంలో చెబుతున్నారు. ఈ విడుదల సందర్భంగా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సింగపూర్ అనేది చంద్రబాబు చెబుతున్నంత మరీగొప్ప దేశం ఏమీ కాదని - స్విస్ ఛాలెంజ్ అనే ముసుగులో పనులన్నీ తీసుకెళ్లి వారి చేతిలో పెట్టడం ఆత్మహత్యా సదృశమని వ్యాఖ్యానిస్తున్నారు. శివరామకృష్ణన్ కమిటీ సిఫారసులన్నిటినీ తుంగలో తొక్కి రాజధాని కడుతున్న వైనం మొత్తం ఆ పుస్తకంలో వివరించారు. చంద్రబాబు చేసుకుంటున్న ఒప్పందాలు మొత్తం లోపభూయిష్టంగా ఉన్నాయని విపులంగా అందులో వివరించారు.
అందుకే ఈ 'భ్రమరావతి' చంద్రబాబు చీకటి ఒప్పందాలను ఖచ్చితంగా బజారు కీడుస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.