ప్రత్యేక హోదా విషయంలో ఎన్నో సందేహాలు.. మరెన్నో అనుమానాలు. కొందరు మేధావుల మాటల్ని పరిగణలోకి తీసుకుంటే.. ప్రత్యేక హోదాను ఏపీ ప్రజలు అడగలేదు. ఏదో వెంకయ్య దయాదాక్షిణ్యాల మీదా.. ఆయనకు ఏపీ మీద ఉన్న ప్రేమాభిమానాల కారణంగా హోదా గురించి అడిగి.. ఈ రోజు అనవసరంగా తిట్టించుకుంటున్నారు అని చెబుతున్నారు. ఒకవేళ ఆ రోజు వెంకయ్య అడిగి ఉండకపోతే ఏం చేసేవాళ్లు అని బరితెగింపుగా వెంకయ్యకు మద్దతు పలుకుతున్నోళ్లు ఉన్నారు.
ఇలా హోదా మీద జరుగుతున్న చర్చ అంతాఇంతా కాదు. అయితే.. ఇక్కడ రెండు విషయాల మీద క్లారిటీ పెద్దగా రాదు. అందులో ఒకటి.. హోదా వల్ల నిజంగా ఏపీకి కలిగే లాభం ఎంత? కొందరు చెబుతున్నట్లుగా ఏడాదికి రూ.60వేల కోట్లు అంటే.. దాని బ్రేకప్ ఏమిటి? ఇక.. రెండోది ఏపీకి హోదా వద్దంటే వద్దని మోడీ ఎందుకు అంత మొండిగా ఉన్నారు? హోదా మీద ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటే ఏపీ ప్రజల మనసుల్లో మోడీ నిలిచిపోతారు. కానీ.. అందుకుభిన్నంగా ఆయన ఎందుకు వద్దంటే వద్దని అనుకుంటున్నారు? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకనిది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక ఆసక్తికర లాజిక్ తెర మీదకు తీసుకొచ్చారు. మొన్న ఈ విషయంపై మాట్లాడి కొన్ని లాజిక్కులు వెల్లడించిన ఉండవల్లి ఈరోజు దానిపై మరింత వివరణ ఇచ్చారు.
ఇప్పటివరకూఎవరో టచ్ చేయని కోణాన్ని ఉండవల్లి స్పృశించారని చెప్పక తప్పదు. ఏపీకి ప్రత్యేక హోదా వద్దనటానికి ఉండవల్లి చెప్పిన కారణం ఏమిటన్న విషయాన్ని ఆయన మాట్లలోనే చూస్తే.. ‘‘దీని వెనుక ఒక పెద్ద విషయం ఉందన్నది నా అనుమానం మాత్రమే. నేను వ్యక్తిగతంగా ఫీలయ్యేది ఏమిటంటే.. విభజన సమయంలో మోడీ సీన్లో లేరు. ఇప్పుడు ఆయనకు ఒక పెద్ద సమస్య వచ్చింది. ఏపీకి ఉన్న పెద్ద అస్సెట్ ఏమిటంటే కేజీ బేసిన్. అందులో ఇప్పటికే గుర్తించిన గ్యాస్ నిల్వలే కాకుండా.. గుర్తించని ఎన్నో వనరులు ఉన్నాయి. వీటి విలువ వేల కోట్ల నుంచి లక్షల కోట్ల రూపాయిల వరకూ ఉండొచ్చు. రిలయన్స్ మొదలు చాలా పరిశ్రమలు గుజరాత్ తీరంలో ఉన్నాయి. ఏపీకి కానీ ప్రత్యేక హోదా ఇస్తే.. ఎక్సైజ్ డ్యూటీ మొదలు చాలానే పన్ను మినహాయింపు వచ్చేస్తాయి. అదే జరిగితే.. గుజరాత్ నుంచి పారిశ్రామికవేత్తలు ఏపీకి క్యూ కడతారు. ఇక్కడే పరిశ్రమలు పెడతారు’’
‘‘అదే జరిగితే మోడీ రాష్ట్రమైన గుజరాత్ లో పరిశ్రమలు మిగలవు. కాకినాడ.. వైజాగ్ కలిసిపోతాయి. పదేళ్లు పన్ను మినహాయింపుతో 20శాతం లాభాన్నిపరిశ్రమలు పొందుతాయి. కోటి ఆదాయంలో రూ.20లక్షల పన్ను మినహాయింపు అంటే.. పారిశ్రామికవేత్తలకు అంతకు మించి కావాల్సింది ఏముంటుంది?గుజరాతీయులు పెద్దవ్యాపారస్తులు. వారు ఇలాంటి వాటికి బాగా ఆకర్షితులవుతారు. టక్ మని అందరూ ఏపీకి షిఫ్ట్ అయిపోతారు. అందుకే ప్రత్యేక హోదా ఆపేశారా? అన్నది నా సందేహం’’ అంటూ చెప్పారు. నిజానిజాల మాట ఎలా ఉన్నా.. ఉండవల్లి లాజిక్ మాత్రం వాస్తవానికి దగ్గరగా ఉన్నట్లు అనిపించట్లేదు..? ఇదంతా ఒక ఎత్తు అయితే తాను పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా పని చేశాను కాబట్టి కేజీ బేసిన్ నిల్వల విలువ తెలుసని ఉండవల్లి చెప్పటాన్ని ‘నోట్ దిస్ పాయింట్’ అనుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.