లక్ష్మీస్ ఎన్టీఆర్... ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఇతర ప్రాంతాలతో పోలిస్తే... ఏపీలో ఈ సినిమాపై మరింతగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే... ఈ సినిమాలో తనను విలన్ గాచూపిస్తున్న నేపథ్యంలో ఎన్నికలు పూర్తయ్యేదాకా సినిమా విడుదలను ఆపాలంటూ టీడీపీ చేసిన అభ్యర్థనకు హైకోర్టు సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో ఈ సినిమా ఇతర ప్రాంతాల్లో నిన్ననే రిలీజ్ అయినా ఏపీలో రిలీజ్ కాలేదు. దీంతో ఈ సినిమాపై ఏపీలో భారీ చర్చకే తెర లేసింది. అసలు సినిమా ఎలా ఉంది? హిట్టా? ఫట్టా? అన్న విషయాలను పక్కనపెడితే... అసలు టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావుకు ప్రస్తుత ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు వెన్నుపోటు పొడిచిన వైనాన్ని దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏ రీతిన చిత్రీకరించారన్న దానిపైనే ప్రధాన చర్చ నడుస్తోంది.
అంతేకాకుండా... ఈ సినిమా ఏపీ ఎన్నికల్లో నిలిచిన టీడీపీకి ఏ మేర దెబ్బ కొడుతుందన్న విషయంపైనా ఆసక్తికర చర్చ నడుస్తోంది. అయినా చంద్రబాబును అంతగా నెగెటివ్‌గా చూపించడానికి ఏముంది? నాడు ఎన్టీఆర్ చేతిలోని పార్టీని, ప్రభుత్వాన్ని చంద్రబాబు లాగేసుకున్న విషయం అందరికీ తెలిసిందే కదా. అంతేకాకుండా నాడు తనకు అన్యాయం చేశారని చంద్రబాబుపై ఆరోపణలు గుప్పిస్తూ ఎన్టీఆర్ కోర్టుకు వెళ్లినా కూడా ఒరిగిందేమీ లేదు కదా అని ఓ వర్గం వాదిస్తున్నా... వర్మ మార్కు డైరెక్షన్ లో ఈ వెన్నుపోటు ఎపిసోడ్ ఎలా తెరకెక్కిందోనన్న ఆసక్తి అంతకంతకూ పెరిగిపోతోంది. ఇందుకు సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా అతీతమేమీ కాదు. టీడీపీ అంటేనే భగ్గుమనే రీతిలో ఫైర్ అయ్యే సీనియర్ పొలిటీషియన్ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఇందుకు అతీతులేమీ కాదు.
అసలే టీడీపీ అన్నా, చంద్రబాబు విధానాలన్నా, చంద్రబాబు అనుంగు పరివారమన్నా తనదైన శైలిలో విరుచుకుపడే ఉండవల్లి... లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని చూడాలన్న కోరికను ఆపుకోలేకపోయారు. ఏపీలో ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకున్న ప్రస్తుత తరుణంలో నేరుగా హైదరాబాద్ వెళ్లిన ఉండవల్లి... లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని వీక్షించారట. ఈ విషయాన్ని ఈ చిత్రానికి గీత రచయితగా పనిచేసిన సిరాశ్రీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. మెస్కో అధినేత విజయ్ కుమార్ తో కలిసి ఉండవల్లి... లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని చూశారని సిరా శ్రీ తెలిపారు. సరే బాగానే ఉంది గానీ... లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని చూసిన ఉండవల్లి... మరి ఆ సినిమాపై ఏం కామెంట్ చేశారు? ఇప్పటిదాకా అయితే ఆయనేమీ కామెంట్ చేయలేదు గానీ... త్వరలోనే ఆయన నుంచి ఈ సినిమాపై అదిరిపోయే కామెంట్ రావడం మాత్రం ఖాయమనే చెప్పాలి.