జగన్ పై ఉండవల్లి ఫుల్లు ఫైర్

Update: 2022-04-16 01:57 GMT
జగన్మోహన్ రెడ్డిపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఫుల్లుగా ఫైరైపోయారు. ప్రభుత్వం అనుసరిస్తున్న అనేక విధానాలను ఉండవల్లి తప్పుపట్టారు. పోలవరం నిర్మాణం, నవరత్నాల పథకాల అమలు, ఆర్ధిక వ్యవహారాలు అన్నింటిపైన విశాఖ మీడియా ముందు రెచ్చిపోయారు. ఇంతకీ ఆయనేమన్నారంటే పోలవరం ప్రాజెక్టును జగన్ వెంటనే కేంద్రానికి అప్పగించేయాలని డిమాండ్ చేశారు.

విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టును కట్టాల్సిన బాధ్యత కేంద్రానిదైతే చంద్రబాబునాయుడు తన చేతిలోకి తీసుకున్నారని మాజీఎంపి చెప్పారు. బీజేపీ ఎలాగూ అధికారంలోకి వచ్చేది లేదు కాబట్టే ప్రాజెక్టుపై కేంద్రానికి పెద్దగా ఆసక్తిలేదన్నారు. అందుకనే డబ్బులు కూడా ఇవ్వటంలేదని ఉండవల్లి అభప్రాయపడ్డారు. కాబట్టి జగన్ వెంటనే ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రానికి వదిలేయాలన్నారు. ప్రాజెక్టు నిధులను మన ఎంపీలు కూడా గట్టిగా అడగలేరు కాబట్టి ఆ ప్రాజెక్టును వదిలించుకోవటమే మేలన్నారు.

ప్రజలకు డబ్బులు పంచుతున్నాను కాబట్టి వాళ్ళంతా తనకే ఓట్లేస్తారనే ప్రమాదకరమైన ధోరణి జగన్లో కనబడుతోందన్నారు. అది ప్రమాదకరమైన ధోరణి ఎలాగవుతుందో ఉండవల్లే చెప్పాలి. ఎవరు ప్రభుత్వంలో ఉండి సంక్షేమ పథకాలు అమలుచేసినా లబ్దిదారులు ఓట్లేస్తారనే ఆశతోనే కదా.

పైగా దీన్ని గాంబ్లింగ్ అని ఉండవల్లి అనటమే విచిత్రంగా ఉంది. సంక్షేమ పథకాలు అమలుచేయటం గాంబ్లింగ్ ఎలాగవుతుంది ? ఎంతకాలం డబ్బులు తీసుకొచ్చి పథకాల రూపంలో డబ్బులు పంచుతారని ఉండవల్లి అడగటంలో తప్పులేదు.

జనసేన అధినేత పవన్ ప్రభావం ఉంటుందని చెప్పిన ఉండవల్లి ఎవరిపైన ప్రభావం చూపుతుందో చెప్పలేనని అనటమే ఆశ్చర్యంగా ఉంది. రాజకీయాల్లో బాగా పండిపోయిన మాజీఎంపీ కూడా పవన్ ప్రభావం ఎవరిపై ఎలా ఉంటుందో చెప్పలేనని చెప్పటమే విచిత్రంగా ఉంది.

పైగా గోదావరి జిల్లాకే చెందిన ఉండవల్లి ఈపాటికే ప్రజల నాడి ఏమిటో తెలుసుకోలేకుండా ఉన్నారా  ? సంక్షేమ పథకాలు అమలు చేయటమే ఓటర్లు మళ్ళీ ఆధరిస్తారని. ఆ ఆశేలేకపోతే అసలు ఉచితాలు, సంక్షేమ పథకాలే ఉండవని ఉండవల్లికి తెలీదా ?
Tags:    

Similar News