షాక్: ఆయన గెలిస్తే ఉపఎన్నిక తప్పదు!

Update: 2021-04-11 08:00 GMT
తమిళనాడు కాంగ్రెస్ కు ఊహించని షాక్ తగిలింది. ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో గెలుపు ధీమాలో ఉంది డీఎంకేతో జత కట్టిన డీఎంకే. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత తక్కువే. సీట్ల కేటాయింపులోనే కాంగ్రెస్ కోరినన్ని సీట్లు ఇవ్వకుననా.. చివర్లో రాహుల్ గాంధీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రమే పొత్తు పొడిచింది. డీఎంకే అండతో తమకంటూ గౌరవస్థానాల్ని సొంతం చేసుకుంటామన్న నమ్మకంలో ఆ పార్టీ ఉంది.

ఇదిలా ఉంటే.. ఊహించని షాక్ ఒకటి కాంగ్రెస్ పార్టీకి తగిలింది. శ్రీవిల్లిపుత్తూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న మాధవరావు.. ఈ రోజున తుదిశ్వాస విడిచారు. గత నెలలో కరోనా బారిన పిన ఆయన.. ఆసుపత్రిలో చేరారు. ఆయనకు అక్కడి సిబ్బంది వైద్య సేవలు అందిస్తున్నారు.

ఇదిలాఉండగా.. ఈ తెల్లవారుజామున ఆయన.. తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్యలతో పరిస్థితి దయనీయంగా మారింది. ఈ సమయంలో ప్రత్యేకంగా చికిత్స చేసినప్పటికి ఆయన ప్రాణాలు పోయాయి. గత నెలలోనూ కరోనా బారిన పడిన ఆయన.. మరోసారి దాని బారిన పడటం.. ఆసుపత్రిలో చికిత్స జరుగుతు్న వైనాన్ని కాంగ్రెస్ నేతలు వెల్లడిస్తున్నారు.

మాధవరావు మరణాన్ని తమిళనాడు పార్టీ ఇన్ చార్జి సంజయ్ దత్త వెల్లడిస్తూ.. శ్వాస సంబంధిత సమస్యతోనే ఆసుపత్రిలో చేరానని.. చికిత్స జరుగుతున్న వేళలోనే మరణించినట్లుగా పేర్కొన్నారు. తమిళనాడులో మొత్తం 234 స్థానాలకు పోలింగ్ జరిగితే..డీఎంకే భాగస్వామ్యంతో కాంగ్రెస్ పోటీ చేసింది. తాజా ఎన్నికల్లో విపక్షంలో ఉన్న డీఎంకే.. కాంగ్రెస్ కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఖాయమన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది.
Tags:    

Similar News