చాలామందికి తెలీని ఒక పాత విషయాన్ని తాజాగా చెప్పుకొచ్చారు ఆర్ బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ తల్లి. తన కొడుకు దేశ భక్తిని శంకించిన వారికి షాకిచ్చేలా ఆమె.. రాజన్ గతాన్ని చెప్పుకు రావటమే కాదు.. దేశం ఎలాంటి వ్యక్తిని ఆర్ బీఐ గవర్నర్ గా చేజార్చుకుంటుందన్న విషయాన్ని ఆమె చెప్పకనే చెప్పేశారు. అంతేకాదు.. రాజన్ దేశ భక్తికి సంబంధించి ప్రధాని మోడీ ఇచ్చిన సర్టిఫికేట్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్న విషయాన్ని ఆమె మాటలు పరోక్షంగా చెప్పేయటం గమనార్హం.
ఆర్ బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ మీద బీజేపీ సీనియర్ నేత ఆరోపణలు చేయటం.. ఆయన దేశభక్తిని శంకించటం.. దానికి ఆయన నొచ్చుకొని ఆర్ బీఐ గవర్నర్ గా తన పదవీ కాలం ముగిసిన వెంటనే తాను అధ్యాపక వృత్తిలోకి వెళ్లిపోవాలని నిర్ణయించటం.. దానిపై దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఆవేదనన వ్యక్తం చేయటం ఒక ఎత్తు అయితే.. రాజన్ మీద తమ పార్టీ నేత విమర్శలు చేసినప్పుడు కామ్ గా ఉన్న ప్రధాని మోడీ.. తాజాగా ఒక మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా రాజన్ దేశ భక్తిని పొగిడేయటం తెలిసిందే.
ఇలాంటి పరిణామాల నేపథ్యంలో రాజన్ తల్లిదండ్రులు తాజాగా మీడియా ముందు పెదవి విప్పారు. ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వారు రాజన్ కు సంబంధించిన కొన్ని ఆసక్తికర అంశాల్ని ప్రస్తావించారు. రాజన్ తల్లి మైథిలి మాట్లాడుతూ.. తన కొడుకు దేశ భక్తిని శంకించటాన్ని ఆమె తీవ్రంగా తప్పు పట్టారు. ‘‘ఈ ఆరోపణల్ని జీర్ణించుకోలేకపోతున్నా. భారత్ లోనే పుట్టి.. భారత్ లోనే ఐఐటీ చదువుకొని.. భారత్ కే సేవలందిస్తున్న నా కొడుకు దేశభక్తిని శంకిస్తారా? ఈ విషయంలో నా కొడుకు ఏమనుకున్నా సరే.. నా అభిప్రాయాన్ని నేను స్పష్టంగా చెబుతాను. నేను.. మా వారి ఉద్యోగం రీత్యా లండన్ లో ఉన్నప్పుడు నా కుమారుడు భారత్ లోనే ఉన్నారు. నిజానికి నా కొడుక్కి లండన్ లో చదువుకునే అవకాశం ఉంది. అయినా.. అలా చేయలేదు. ఢిల్లీ ఐఐటీ విద్యార్థి సంఘం నాయకుడిగా రాజన్ వ్యవహరించేవాడు. 1984లో సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో రాజన్ ఢిల్లీలోనే ఉన్నాడు. విద్యార్థి సంఘం నాయకుడిగా.. పలువురు సిక్కుల్ని కాపాడేందుకు ఢిల్లీలోనే ఉండి.. వీలైనంత ఎక్కువ మంది సిక్కుల్ని ఐఐటీ ప్రాంగణంలో తల దాచుకునేలా చేశారు. అలాంటి వ్యక్తి మీద నిందలు వేస్తారా. నా కొడుకు దేశభక్తినే శంకిస్తారా?’’ అని ప్రశ్నించారు.
ఇక.. రాజన్ తండ్రి.. సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారిగా రిటైర్ అయిన గోవింద రాజన్ మాట్లాడుతూ.. తన కొడుకు మీద జరిగిన దుష్ప్రచారాన్నిమోడీ సర్కారు సకాలంలో రియాక్ట్ అయి ఉంటే.. తన కొడుకు ఆర్ బీఐ గవర్నర్ గా మరోసారి కొనసాగి ఉండేవారన్నారు. ఒక తండ్రిగా తన కొడుకు పక్షాన తాను మాట్లాడటం లేదని.. ఈ అంశం వివాదాస్పదమై.. ప్రపంచాన్ని ఆకర్షించింది కాబట్టే తాను నోరు విప్పినట్లుగా ఆయన చెప్పారు. రాజన్ తండ్రి చెప్పినట్లు.. రాజన్ దేశభక్తిని విపరీతంగా పొగిడేసిన ప్రధాని మోడీ.. మొదటే ఆ విషయాన్ని ఎందుకు చెప్పలేదు. ఆయన చేతిలో ఉన్న ఐఫోన్ లోని ట్విట్టర్ అకౌంట్లో ఒక్క ట్వీట్ చేసినా సరిపోయేది కదా? ఈ చిన్న పనిని మోడీ ఎందుకు చేయనట్లు..?