మోడీ జమిలి కలలు...ఇంకా కాస్తూనే ఉన్నాయి

Update: 2022-12-15 15:29 GMT
కలలు ఎన్నో వస్తాయి. అవి నీటి బుడగల మాదిరిగా పుడుతూ పోతూ ఉంటాయి. కొన్ని కలలు కాలం గడిచే కొద్దీ కావని తెలిసే కొద్దే అలా తెలియకుండానే కరిగిపోతాయి. అయిత దేశాన్ని ఏలే నరేంద్ర మోడీ కన్న కలలకు ఎపుడూ కాలం చెల్లదు. అంతే కాదు ఆయన కలలను నెరవేర్చుకునేవరకూ వదిలిపెట్టే రకం కూడా కాదు. కాశ్మీర్ కి స్వయం ప్రతిపత్తి రద్దు అని కల కన్నారు. అది తీర్చుకున్నారు.

అయోధ్యలో రామాలయం నిర్మాణం చేయాలని కల కన్నారు. దాన్ని కూడా తీర్చుకున్నారు. ఇపుడు జమిలి ఎన్నికల కలను ఎనిమిదేళ్ళుగా కంటూనే  ఉన్నారు.అది కూడా ఏదో నాటికి నెరవేరుతుంది అని అంటున్నారు. తాజాగా పార్లమెంట్ లో జమిలి ఎన్నికల గురించి మరో మారు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు  జమిలి ఎన్నికల గురించి కేంద్రం ఆలోచనలను సభ ముందు ఉంచారు. జమిలి ఎన్నికలు ముద్దు అన్నారు. దేశంలో రాష్ట్రాలకు కేంద్రానికి ఒకేసారి జరిగితే ఎంతో వ్యయం కాలం, శ్రమ అన్నీ మిగులుతాయని చెప్పారు.

ఇక దేశంలో జమిలి ఎన్నికలు 1951, 1952, 1957, 1962, 1967లో జమిలి ఎన్నికలు జరిగాయని ఆయన గతాన్ని గుర్తు చేశారు. అయితే  1968, 69లో పలు అసెంబ్లీలు నిర్ణీత గడువు కంటే ముందే రద్దుకావడంతో జమిలి ఎన్నికలకు బ్రేక్ పడింది అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. దేశాల్లో కానీ రాష్ట్రాలలో కానీ పరిపాలన సాఫీగా జరగాలన్నా,  సుస్థిరత ఉండాలన్నా జమిలి ఎన్నికలే మేలంటూ లా కమిషన్ తన 170వ నివేదికలోనూ సూచించిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

మోడీ సర్కార్ ఆ విధంగా జమిలి ఎన్నికల గురించి తన అభిప్రాయాన్ని ఎప్పటికపుడు వెల్లడిస్తూనే ఉంది. కానీ అవి జరిగే పనేనా అన్నదే కదా చర్చ. జమిలి ఎన్నికలు అంటే దేశమంతా ఉన్న 28 రాష్ట్రాలలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు అన్నీ 2024 నాటికి ఎన్నికలకు వెళ్లాయి. నిన్న జరిగిన గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ తో పాటు 2023లో జరగనున్న తెలంగాణా, కర్నాటక రాష్ట్రాలు కూడా తమ పదవీ కాలాన్నీ గరిష్టంగా త్యాగం చేయాల్సి ఉంటుంది.

మరి జమిలి ఎన్నికలకు ఎక్కడ బ్రేక్ పడింతో కేంద్ర మంత్రి చెప్పారు. అసెంబ్లీలు నిర్ణీత కాలం కంటే ముందే రద్దు కావడం వల్లనే జమిలికి  అతి పెద్ద ఫుల్ స్టాప్ పడిపోయింది అని వివరించారు. ఇప్పటికి అర్ధ శతాబ్ద కాలం నుంచి లోక్ సభ అసెంబ్లీలకు విడివిడిగానే ఎన్నికలు జరుగుతున్నాయి. మరి నిర్ణీత కాలంలో అసెంబ్లీలు రద్దు కాకూడా రాజ్యంగపరమైన పరిష్కారం ఏంటో మోడీ సర్కార్ కనుగొందా అన్నదే చర్చ.

అంతే కాదు ఎవరికీ మెజారిటీ రాని పరిస్థితులు, ఒకటి కంటే అనేక పార్టీలు పోటీ పడి మ్యాజిక్ ఫిగర్ ని అందుకోలేని పరిస్థితులను దేశం చాలా చోట్ల చూస్తోంది. మరి వాటికి కూడా జవాబు రాజ్యాంగపరంగా చెప్పాల్సి ఉంది. ఇక అసెంబ్లీలు పార్లమెంట్ అయిదేళ్లకు ఒక మారు ఎన్నికలకు వెళ్లడం మంచిదే. దాని కోసం అంతా కలసి తరుణోపాయన్ని కనుక ఆలోచించుకుంటే జమిలి ఎన్నికలు వస్తాయి. మోడీ  కలలు  నెరవేరుతాయని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News