ప్రధాని మోడీకి మంచి మిత్రులుగా ఉండేవారు.. ఆయనకు సన్నిహింగా వ్యవహరించే నేతలు కొందరు తీవ్ర అస్వస్థతకు గురి కావటం కనిపిస్తోంది. ఆ మధ్య అస్వస్థతో గోవా ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న మనోహర్ పారీకర్ ఆసుపత్రిలో చేరిన వైనం తెలిసిందే. ఆయన ఆరోగ్యం కుదుట పడకపోగా.. మరింత సీరియస్ కావటంతో ఆయన్ను హుటాహుటిన విదేశాలకు తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి కానీ.. ఆయన మాత్రం భారత్ రాని పరిస్థితి.
ఇదే బాటలో మరో మంత్రి చేరారు. తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా వ్యవహరిస్తున్న కిరణ్ రిజిజు అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చేరారు. సైనసైటిస్ సమస్య తో ఇబ్బందిపడుతున్నట్లుగా చెబుతున్నారు. గురువారం ఎయిమ్స్ లో చేరిన కేంద్రమంత్రికి డాక్టర్లు మైనర్ సర్జరీ చేసినట్లుగా తెలుస్తోంది. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంటే ఈ రోజు సాయంత్రంకానీ.. రేపు కానీ కేంద్రమంత్రిని ఆసుపత్రి ఉంచి డిశ్చార్జ్ చేస్తారని చెబుతున్నారు. వరుస పెట్టి మోడీకి సన్నిహితులుగా ఉన్నోళ్లంతా ఆసుపత్రి పాలు కావటం ఇప్పుడు బీజేపీకి ఆందోళన కలిగిస్తోంది.