గుండెను గడ్డ కట్టించి.. మళ్లీ , ఆ తర్వాత !

Update: 2021-09-29 17:30 GMT
మనిషి అయినా జంతువైనా, పక్షులైనా గుండె కొట్టుకుంటేనే జీవించి ఉన్నట్లుగా. నిర్విరామంగా కొట్టుకునే గుండె ఒక్కసారిగా ఆగిపోతే..ఇక ప్రాణం పోయినట్లే. అటువంటి గుండె మార్పిడులు ఇప్పుడు సునాయాసంగా జరిగిపోతున్నాయి. బ్రెయిన్ డెడ్ అయినా గుండె కొట్టుకుంటునే ఉంటుంది.అటువంటి వ్యక్తుల నుంచి వారి కుటుంబ సభ్యుల అనుమతితో గుండె మార్పిడులు జరుగుతున్నాయి. గుండెమార్పిడి ద్వారా కొత్త జీవితాలకు అంకురార్పణ చేస్తున్నారు. కానీ ఆరు అడుగుల పొడుగున్న వ్యక్తి అయినా అతి చల్లని వాతావరణంలో గడ్డకట్టుకుపోతాడు.అయినా గుండె కొట్టుకుంటునే ఉంటుంది.

కానీ గుండెను అతి చల్లని ప్రదేశంలో పెడితే..ఏమీ కాదా  కొట్టుకోవటం ఆగిపోదా  అంటే..లేదు గుండె కొట్టుకుంటునే ఉంటుందంటున్నారు నిపుణులు. ఇదెలా నిరూపణ అయ్యిదంటే.ఓ గుండెను అత్యంత చల్లని వాతావరణంలో పెట్టారు. అది గడ్డకట్టుకుపోయాక తిరిగి కొట్టుకునేలా చేశారు యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా శాస్త్రవేత్త బోరిస్‌ రుబిన్‌ స్కీ. గుండె కణజాలాన్ని అతిశీతల ఉష్ణోగ్రతల్లో భద్రపరచడమే కాకుండా, ఆ తరువాత అది మళ్లీ కొట్టుకునేలా కూడా చేయగలిగారు బోరిస్ రుబిన్ .  

సాధారణంగా గుండె మార్పిడి అంటే..అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. ఏమాత్రం తేడా జరిగినా గుండె కొట్టుకోవటం ఆగిపోతుంది. దాత శరీరం నుంచి గుండెను వేరు చేసిన తరువాత నిర్దిష్ట సమయంలోగా దాన్ని దాతకు అమర్చాలి. ఈప్రక్రియలో ఏమాత్రం తేడా రాకూడదు. ఎందుకంటే గుండెను ఎక్కువ కాలం నిల్వ చేయలేకపోవడమే దీనికి కారణం. ఫ్రిడ్జ్‌లో పెడితే కణజాలం పై మంచు స్ఫటికాలేర్పడి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశముంది. ఈ క్రమంలో గుండెతోపాటు ఇతర అవయవాలను కూడా కొంచెం ఎక్కువకాలం నిల్వచేసే పద్ధతులపై ప్రపంచవ్యాప్తంగా చాలా పరిశోధనలు జరుగుతున్నాయి.ఈ పరిశోధనలు సక్సెస్ అయితే..ప్రమాదాలబారిన పడినవారి ప్రాణాలను రక్షించినట్లే.

గుండెను ఎక్కువ కాలం నిల్వ చేయలేకపోని దశకు దాదాపు చెక్ పెట్టారు యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా శాస్త్రవేత్త బోరిస్‌ రుబిన్‌ స్కీ విజయం సాధించారు. గుండె కణజాలాన్ని అతిశీతల ఉష్ణోగ్రతల్లో భద్రపరచడమే కాకుండా..ఆ తరువాత అది మళ్లీ కొట్టుకునేలా కూడా చేయగలిగారు బోరిస్ రుబిన్ స్కీ.ఎప్పుడో 16 ఏళ్ల క్రితం రుబిన్‌ స్కీ ఐసోకోరిక్‌ సూపర్‌ కూలింగ్‌ పేరుతో అభివృద్ధి చేసిన ఓ టెక్నిక్‌కు మరింతగా పరిశోధనలు చేసి అవయవ కణజాలంపై మంచు స్ఫటికాలు ఏర్పడకుండానే నిల్వ చేయగలిగారు.ఫ్రిడ్జ్‌ లో పెడితే కణజాలం పై మంచు స్ఫటికాలేర్పడి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశముంది. ఈ క్రమంలో గుండెతోపాటు ఇతర అవయవాలను కూడా కొంచెం ఎక్కువకాలం నిల్వచేసే పద్ధతులపై ప్రపంచవ్యాప్తంగా చాలా పరిశోధనలు జరుగుతున్నాయి.

వీటిల్లో  శాస్త్రవేత్త బోరిస్‌ రుబిన్‌ స్కీ విజయం సాధించారు. గుండె కణజాలాన్ని అతిశీతల ఉష్ణోగ్రతల్లో భద్రపరచడమే కాకుండా, ఆ తరువాత అది మళ్లీ కొట్టుకునేలా కూడా చేయగలిగారు. ఒక ద్రవంలో అవయవాన్ని లేదా భద్రపరచాల్సిన పదార్థాన్ని ఉంచి అందులోకి గాలి చొరబడకుండా చేయడం ఈ ప్రక్రియలోని కీలక అంశం. మూలకణాల సాయంతో అభివృద్ధి చేసిన గుండె కణజాలాన్ని తాము ఈ పద్ధతి ద్వారా –3 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతల్లో నిల్వ చేయగలిగామని, ఒకరోజు నుంచి మూడు రోజులపాటు దీన్ని నిల్వ చేసి చూడగా ప్రతిసారి అది మళ్లీ కొట్టుకుందని రూబిన్‌స్కీ తెలిపారు.
Tags:    

Similar News