కంటికి కనిపించని ఓ వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తుంది. ఈ వైరస్ దెబ్బకి ప్రపంచం మొత్తం గత మూడు నెలలుగా షట్ డౌన్ లోకి వెళ్ళిపోయింది. అయితే , ఈ మహమ్మారి అంటే మొదట్లో వణికిపోయిన ప్రజలు ఇప్పుడు దాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారు. మాస్కులు, భౌతిక దూరం పాటించకుండా ఇష్టానుసారంగా రోడ్లపైకి వచ్చేస్తున్నారు. లాక్అ డౌన్ పొడిగిస్తూ పొతే కూలి చేసుకొని జీవితం గడిపేవారికి కష్టం అవుతుంది అని సడలింపులు ఇస్తే ..ఇష్టానుసారంగా రోడ్లమీదకు వచ్చేస్తున్నారు.
ఇకపోతే దాదాపు రెండు నెలల తర్వాత ఇవాళ్టి నుంచి అన్ లాక్ 1 నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులకు అనుగుణంగా దేశవ్యాప్తంగా హోటళ్లు, ప్రార్ధనా మందిరాలు, షాపింగ్ మాల్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి. కంటైన్మెంట్ జోన్లు మినహాయించి మిగిలిన ప్రాంతాలన్నింటిలోనూ ఇవి తెరుచుకోనున్నాయి. వరుసగా ఐదోసారి రోజుకు 9,000 పైచిలుకు కేసులు దేశంలో నమోదవుతున్న తరుణంలో ఈ అన్‌లాక్ 1 ఎంతమేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఈ అన్ లాక్ 1 వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న 5 రాష్ట్రాలకు సవాల్ గా మారనుంది.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉన్నా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూ వచ్చాయి. అయితే ఇప్పటి నుంచి ప్రజలు అసలైన పరీక్షను ఎదుర్కోనున్నారు. మాల్స్, రెస్టారెంట్లు, ఆలయాలు ఓపెన్ అయ్యాయి. మునపటిలా పరిస్థితి ఉండదు. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. షాపింగ్ మాల్స్ లో సినిమా థియేటర్లు, గేమింగ్ ప్లేస్స్, పిల్లలు ఆడుకునే ఏరియాలు మూసే ఉంటాయి. ఈ రోజు నుండి అన్ లాక్ 1 ప్రారంభం కావడంతో ప్రతీ ఒక్కరూ కూడా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్తలు పాటించండి.