కరోనా చేయిదాటిపోతోంది. ఊహకందని రీతిలో విస్తరిస్తోంది. ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఇలా అందరికీ సోకుతూనే ఉంది. నిర్లక్ష్యం వహించిన వారికి కరోనా కాటు తప్పడం లేదు.
దక్షిణాది కంటే ఉత్తర భారతంలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. ఉత్తరప్రదేశ్ లో కరోనా మహమ్మారి బాగా విస్తరిస్తోంది. రోజురోజుకు యూపీలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.
తాజాగా యూపీ కేబినెట్ లో ఇద్దరు మంత్రులకు కరోనా సోకడం కలకలం రేపింది. యూపీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి రాజేంద్ర ప్రతాప్ సింగ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కరోనా సోకింది. ఆయూష్ శాఖ మంత్రి ధరమ్ సింగ్ సైనీ కూడా కరోనా బారిన పడ్డారని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కాగా యూపీలో ఇప్పటికే 27వేల కరోనా కేసులు నమోదయ్యాయి.