నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌కు ఓకే.. ఏపీలో మార్పు షురూ..!

Update: 2022-07-07 03:29 GMT
రెండు తెలుగు రాష్ట్ర ప్ర‌భుత్వాలు, ఇత‌ర రాజ‌కీయ పార్టీలు కూడా ఎప్పుడెప్పుడా.. అని ఎదురు చూస్తున్న అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌కు క‌స‌ర‌త్తు ప్రారంభ‌మైంది. వ‌చ్చే వ‌ర్షాకాల పార్ల‌మెంటు స‌మావేశా ల్లోనే ఈ బిల్లును ప్ర‌వేశ పెట్టేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఈ బిల్లుకు సం బంధించి ఇప్ప‌టికే రెండు తెలుగు రాష్ట్రాల శాస‌న‌స‌భ‌ల అధికారుల‌ను కూడా కేంద్ర హోం శాఖ వ‌ర్గాలు క‌లిసిన‌ట్టు స‌మాచారం. దీంతో ఈ ప్ర‌క్రియ పుంజుకుంటోంద‌ని అంటున్నారు.

విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం .. ఏపీ, తెలంగాణ‌ల్లో అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌ను పెంచాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ క్ర‌మంలో ఏపీలో 50 స్థానాల వ‌ర‌కు పెర‌గ‌నున్నాయి. ప్ర‌స్తుతం 175 స్థానాలున్న ఏపీలో నియోజ‌క‌వ‌ర్గా లు 225కు చేరుకుంటాయి.

ఈ మార్పు కోస‌మే గ‌తం నుంచి ప్రాంతీయ పార్టీలు ఎదురు చూస్తున్నాయి. గ‌తంలో అధికారంలో ఉన్న టీడీపీ అయినా.. ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న వైసీపీ అయినా.. నియోజ‌కవ ర్గాల పెంపు కోసం ఎదుచూస్తున్నాయి.

త‌ద్వారా.. ఆయా పార్టీలు రెండు ప్ర‌ధాన ప్ర‌యోజ‌నాలు ఆశిస్తున్నాయి. ఒక‌టి.. పార్టీలో అసంతృప్తుల‌ను త‌గ్గించ‌డం.. రెండు.. మ‌రింత మందికి ప్రాధాన్యం ఇచ్చే అవ‌కాశం ఉండ‌డంతో ఎప్పుడెప్పుడా అని నియో జ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న కోసం.. పార్టీలు ఎదురు చూస్తున్నాయి. షెడ్యూల్ ప్ర‌కారం.. కొత్త‌ రాష్ట్రాలు ఏర్ప‌డి న 10 ఏళ్ల‌లోగా జ‌నాభా లెక్క‌ల ప్రాతిప‌దిక‌న‌.. ఈ నియోజ‌క‌వ‌ర్గాల‌ను విభ‌జ‌స్తారు. ఇప్పుడు 2024లో ఏపీ, తెలంగాణలోని నియోజ‌క‌వ‌ర్గాల‌ను విభ‌జించ‌నున్నారు.

ఇక‌, ఇప్పుడున్న ప‌రిస్థితిలో వైసీపీ.. టీడీపీల్లో నాయ‌కుల సంఖ్య బ‌లంగా ఉంది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి వీరిని అన్ని చోట్లా భ‌ర్తీ చేసేందుకు అవ‌కాశం ఉంటుంది. ఈ రెండు పార్టీల‌కు కూడా ఇది సంతోష‌క‌ర‌మైన విష‌యంగానే ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

అయితే.. జ‌న‌సేన‌.. బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీలకు మాత్రం నియోజ‌క‌వ‌ర్గాల విభ‌జ‌న తీవ్ర ఇబ్బందిక‌రంగా మారుతుంద‌ని అంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లోనే ఈ పార్టీల‌కు అభ్య‌ర్థులు ల‌భించ‌లేదు. దీంతో మ‌రిన్ని నియోజ‌క‌వ‌ర్గాలు పెరిగితే.. తిప్ప‌లు త‌ప్ప‌వ‌ని అంటున్నారు.
Tags:    

Similar News