కొద్దినెలల కిందట అట్టహాసంగా రాజకీయ పార్టీ లాంచ్ చేసిన కన్నడ స్టార్ ఉపేంద్ర మంగళవారం సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆయన తన పార్టీని రద్దు చేసి బీజేపీలో చేరుతారని కన్నడనాట భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్లుగానే ఆయన కూడా ‘ఈ నెల 6 నాకు అగ్నిపరీక్ష.. ప్రజాకీయమా? రాజకీయమా? అన్నది ఆ రోజు నిర్ణయమవుతుంది’ అని ట్వీట్ చేశారు.
కాగా పార్టీ పెట్టిన తరువాత ఉపేంద్ర వైపు నుంచి రాజకీయ యాక్టివిటీ ఇంతవరకు లేదు. మరోవైపు పార్టీలో గొడవలూ మొదలయ్యాయి. పార్టీ ఉపాధ్యక్షుడు ఇటీవల ఉపేంద్రకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలు చేశారు. ఉపేంద్ర నియంత్రలా బిహేవ్ చేస్తున్నారని... ఎన్నికలు ఇంకా రెండు నెలలే ఉన్నా ఆయన ఎలాంటి కార్యాచరణ చేపట్టడం లేదని.. మేనిఫెస్టో గురించి కూడా ఆలోచించడం లేదని.. తాము చెబుతున్నా వినడం లేదని ఆరోపించారు. అంతేకాదు.. అవినీతి, ఆశ్రిత పక్షపాతానికి వ్యతిరేకంగా పార్టీ పెట్టిన ఆయన పార్టీలో కుటుంబసభ్యులకే పెద్ద పీట వేస్తున్నారని శివకుమార్ ఆరోపించారు.
ఇప్పటికే శివకుమార్ వర్గానికి ఉపేంద్రకు విభేదాలు తీవ్రమయ్యాయని.. ఉపేంద్రతో బీజేపీ నేతలు టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. తానే స్వయంగా పార్టీని వీడడం కానీ.. రద్దు చేయడం కానీ చేసి ఆయన బీజేపీలో చేరిపోతారని కర్ణాటకలో ప్రచారం జరుగుతోంది.