రాజకీయాల్లోకి సినీస్టార్లు. పలువురు సెలబ్రిటీలు వరస పెట్టి వస్తున్నారు. మిగిలిన రంగాలతో పోలిస్తే.. సినీ రంగానికి చెందిన ప్రముఖులు గడిచిన కొద్దిరోజులుగా పాలిటిక్స్ కు ఎంట్రీ ఇస్తున్నారు. రానున్నరోజుల్లో ఈ హడావుడి మరింత పెరగనుందన్న వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలాఉంటే.. రెండు.. మూడు రోజుల క్రితమే కొత్త రాజకీయ పార్టీ పెట్టటానికి ప్రముఖ కన్నడ.. తెలుగు నటుడు ఉపేంద్ర రెఢీ కావటం.. అందుకు సంబంధించిన ప్రకటనను చేయటం తెలిసిందే.
అయితే.. ఉపేంద్ర ఎంట్రీపై తాజాగా సామాజిక కార్యకర్త ఒకరు తీవ్ర విమర్శలు చేశారు. ప్రముఖ ఆర్టీఐ కార్యకర్త ఎస్ ఆర్ హీరేమఠ్ మీడియాతో మాట్లాడుతూ ఉపేంద్ర మీద ఆరోపణలు చేశారు. ముందు ఉపేంద్ర మారాలని. ఆ తర్వాత ఆయన ప్రజల్ని ఉద్దరించే పని చేపట్టాలన్నారు. రైతుల భూముల్ని కొనుగోలు చేసిన ఉపేంద్ర రూల్స్ ను బ్రేక్ చేస్తూ వ్యవసాయ భూముల్ని వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించుకున్నారంటూ ఆరోపించారు. వ్యవసాయ భూముల్లో వాణిజ్య కార్యకలాపాలు ఎలా నిర్వహిస్తారని ఆయన సూటిగా ప్రశ్నించారు.
మొదట రైతుల వద్ద నుంచి తీసుకున్న భూముల్ని వెనక్కి ఇచ్చేయాలని.. అలా చేస్తే ఉపేంద్ర ప్రజల కష్టాలు గుర్తించిన నాయకుడిగా భావించొచ్చన్నారు. ఇదిలా ఉంటే.. రైతుల వద్ద నుంచి ఉపేంద్ర తీసుకున్న వ్యవసాయ భూముల విషయంలో కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇవ్వటం గమనార్హం. సామాజిక కార్యకర్త సంధించిన ఆరోపణాస్త్రాన్ని రాజకీయ నాయకులు మరెంతగా అందిపుచ్చుకుంటారో చూడాలి. చూస్తుంటే.. ఉపేంద్ర పొలిటికల్ ఎంట్రీ లోనే సమస్యలు ఎదురయ్యేటట్లు కనిపిస్తున్నాయని చెప్పక తప్పదు.