పేదరికంపై భారత్ భారీ విజయం.. యూఎన్ అభినందన!

Update: 2019-07-13 14:30 GMT
పేదరిక నిర్మూలనలో భారత్ మంచి రీతిన సాగుతోందని అభినందించింది ఐక్యరాజ్యసమితి. దేశంలో పేదరిక నిర్మూలన గణనీయమైన స్థాయిలో ఉందని యూఎన్ కితాబునిచ్చింది. రెండువేల ఆరు  నుంచి రెండు వేల పదహారు వరకూ మధ్యన దేశంలో మారిన పరిస్థితులను ఉద్దేశించి యూఎన్ గణాంక సహితంగా స్పందించింది.

దేశంలో ఏకంగా ఇరవై ఏడు కోట్ల మంది ప్రజలు పేదిరికం నుంచి బయటపడ్డారని,  వారి స్థాయి  పెరిగిందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. రెండు వేల ఆరు నుంచి రెండు వేల  పదహారు మధ్యన గణాంకాలను యూఎన్ తాజాగా విడుదల చేసింది. ఏకంగా ఇరవై ఏడు కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకురావడం ద్వారా భారత్ పేదరిక నిర్మూలనకే కొత్త నిర్వచనాన్ని ఇచ్చిందని ఐక్యరాజ్యసమితి కితాబునిచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా నూటా ఒక్క దేశాల్లో పేదరిక నిర్మూలనపై ఐక్యరాజ్యసమితి అధ్యయనం జరిగింది. అందులో ఈ ఫలితాలు వచ్చినట్టుగా పేర్కొంది. ప్రత్యేకించి దక్షిణాసియా దేశాలు  పేదరిక నిర్మూలనలో మంచి ఫలితాలు సాధించాయని, వాటిల్లో కూడా ఇండియా ఈ విషయంలో చాలా మెరుగైన ఫలితాలను నమోదు చేసిందని ఐక్యరాజ్యసమితి వివరించింది.
Tags:    

Similar News