భార‌తీయులకు అమెరికా వెల్ కం చెబుతోంద‌ట‌!

Update: 2018-08-06 05:25 GMT
లోక‌ల్ అంటూ.. గ‌ల్లీ లీడ‌ర్ మాదిరి చిన్న‌బుద్ధిని ప్ర‌ద‌ర్శిస్తున్న అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ తీరు తెలిసిందే. ఈ రోజున అమెరికా ఈ స్థానంలో ఉండ‌టానికి కార‌ణం.. ప్ర‌పంచంలో టాలెంట్ ఎక్క‌డున్నా వెతికి మ‌రీ ప్రోత్స‌హించ‌ట‌మే. అయితే.. ట్రంప్ ఎంట్రీ మొద‌లు లోక‌ల్ కు అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తూ. అమెరికాలో ఉండే విదేశీయుల‌పై క‌త్తి క‌ట్ట‌ట‌మే కాదు.. ఇత‌ర దేశాల నుంచి ఉపాధి కోసం వ‌చ్చే వారికి రూల్స్ పేరిట చెక్ పెట్ట‌టం షురూ చేశారు.

దీంతో.. అమెరికాలో విదేశీయుల‌కు ల‌భించే అవకాశాలు అంత‌కంత‌కూ త‌గ్గిపోతున్న ప‌రిస్థితి. ఈ ప్ర‌భావం భార‌త్ మీదా ప‌డింది. హెచ్ 1బీ వీసా రూల్స్ ను క‌ఠిన‌త‌రం చేస్తున్న వైనం ప‌లువురు భార‌తీయుల‌కు ఇబ్బందిక‌రంగా మారింది. ఇదిలా ఉంటే.. ట్రంప్ తీరుకు భిన్న‌మైన వ్యాఖ్య‌లు చేశారు అమెరికా కాన్సుల్ జ‌న‌ర‌ల్ ఎడ్గార్డ్ క‌గ‌న్‌.

టాలెంట్‌ కు త‌మ దేశం స్వాగ‌తం ప‌లుకుతుంద‌ని.. ప్ర‌తిభావంతుల్ని ప్రోత్స‌హించ‌టంలో అమెరికా ఎప్పుడూ ముందు ఉంటుంద‌న్న ఆయ‌న‌.. భార‌త్ తో సంబంధాలు పెంచుకునేందుకు ట్రంప్ ఎంతో చిత్త‌శుద్ధితో ఉన్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

దీనికి సాక్ష్యంగా ఏడాది కాలంలో భార‌త్ నుంచి అమెరికాకు వెళ్లిన వారి గ‌ణాంకాలు చెప్పేస్తున్న‌ట్లుగా పేర్కొన్నారు. అమెరికాలో చ‌దువుకోవాల‌నుకునే భార‌తీయుల్ని తాము ప్రోత్స‌హిస్తామ‌న్నారు. అదే స‌మ‌యంలో.. భార‌త్ లో చ‌ద‌వాల‌ని అనుకునే అమెరికన్ల కార‌ణంగా రెండు దేశాల మ‌ధ్య సంబంధించి మ‌రింత బలోపేతం చేస్తున్న‌ట్లు చెప్పారు. భార‌తీయుల్ని ఎలా చూడాలో త‌మ దేశానికి తెలుస‌న్న క‌గ‌న్‌.. ట్రంప్ అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి భార‌త్ తో ఉన్న సంబందాల‌ను మ‌రింత పెంచుకోవ‌టానికి.. బ‌లోపేతం చేసుకోవ‌టానికి అత్యంత ప్రాధాన్య‌త ఇచ్చిన వైనం కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంద‌ని పేర్కొన్నారు. వినేందుకు మాట‌లు బాగానే ఉన్నా.. ట్రంప్ చేత‌ల‌కు మాత్రం భిన్నంగా ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News