అమెరికా ద్రవ్యోల్బణం ఎఫెక్ట్: ధరలు విపరీతంగా పెరిగేశాయ్

Update: 2022-07-13 16:47 GMT
అమెరికన్లు రుణం తీసుకోవడం కష్టంగా మారుతోంది.వినియోగదారులు కొనుగోలు చేయడానికి భయపడుతున్నారు. దీనంతటికి కారణం.. అమెరికాలో ధరలు పైపైకి చేరుతున్నాయి. ద్రవ్యోల్బణం పతాకస్థాయికి చేరింది. 40 ఏళ్ల గరిష్ట స్థాయికి ఈ ద్రవ్యోల్బణం చేరుకుంది.

గ్యాస్ ధరలు, ఆహార ధరలు పెరిగాయి. ద్రవ్యోల్బణం కూడా ఆకాశాన్ని తాకినట్టు ఆ ప్రభుత్వ డేటాలో తెలిసింది. ఈ ధరలు పెరుగుదల అమెరికాలోని చాలా కుటుంబాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. దీంతో అధ్యక్షుడు జోబైడెన్ పై కూడా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.

అమెరికాలో గత ఏడాదితో పోలిస్తే ద్రవ్యోల్బణం జూన్ నెలలో 9.1 శాతానికి పెరిగినట్లు ప్రభుత్వ డేటాలో తెలిసింది. 1981 తర్వాత నుంచి అత్యధికంగా నమోదుకావడం ఇదే తొలిసారి. మే నెలలో నమోదైన 8.6 శాతం నుంచి ద్రవ్యోల్బణం 9.1 శాతానికి పెరిగింది. నెలవారిగా చూసుకుంటే మే నుంచి జూన్ వరకూ ధరలు 1.3 శాతం పెరిగాయి. ఏప్రిల్ నుంచి మే నెలకు 1 శాతం పెరిగాయి. ప్రతీనెల 1శాతం పెరుగుతున్నాయి.

భారీగా పెరుగుతోన్న ఈ ధరలు.. చాలా కుటుంబాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. నిత్యావసరాల ఖర్చులను పెంచుతోంది. ఈ ధరలు సగటు ఆదాయాల కంటే వేగంగా పెరుగుతున్నాయి. తక్కువ ఆదాయం గల బ్లాక్ అమెరికన్లపై తీవ్ర ప్రభావాన్ని చూపనుందని తెలుస్తోంది. వారు సంపాదించే ఆదాయంలో అత్యధిక భాగం హౌసింగ్, ట్రాన్స్ పోర్టేషన్, ఫుడ్ పైనే ఖర్చు పెడుతున్నారు.

ఇప్పటివరకూ అడ్డూ అదుపు లేకుండా పెరుగుతోన్న ద్రవ్యోల్బణం ఎకానమీలో వినియోగదారుల విశ్వాసాన్ని భారీగా దెబ్బతీస్తోంది. ఈ పెరుగుతున్న ద్రవ్యోల్బణం అధ్యక్షుడు జోబైడెన్ పై మరింత ఒత్తిడి పెంచుతోంది. మధ్యంతర ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఈ ద్రవ్యోల్బణం పెరుగుతుండడంతో డెమోక్రాట్లకు మద్దతు తగ్గుతోంది.

అమెరికాలో ద్రవ్యోల్బణం పెరగడంతో మే నుంచి జూన్ వరకు 11.2 శాతం ధరలు పెరిగాయి. ఎనర్జీ ధరలు 3.5 శాతం పెరిగాయి. ఫుడ్ ఖర్చులు 10.4 శాతం పెరిగాయి. 1981 తర్వాత అమెరికాలో ఈ స్థాయిలో ధరల పెరుగుదల నమోదు కావడం ఇప్పుడే. ఈ ధరల పెరుగుదలతో అమెరికా ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకింది.
Tags:    

Similar News