ఉగ్రవాదులను పెంచిపోషించేందుకు కేరాఫ్ అడ్రస్ గా మారిన పాకిస్తాన్ పరువు అంతర్జాతీయ సమాజంలో మరోమారు పలుచన అయ్యే ప్రమాదం కొద్దిలో తప్పింది. అగ్రరాజ్యం అమెరికాకు కోపం నషాళానికి చేరినప్పటికీ...చివరి నిమిషంలో తమాయించుకోవడం వల్ల...ఆ పరిణామం తప్పిపోయింది. అల్ కయిదా ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు ఒసాబా బిన్ లాడెన్ ను హతమార్చడానికి 2011లో పాక్‌లో అమెరికా నేవీ సీల్ కమెండోలు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల మరో అదే తరహా దాడి జరపాలని అమెరికా సేనలు భావించాయి. అదే జరిగితే ఇస్లామిక్ ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చి కాపాడుతున్న పాక్ కు అది మరో మాయనిమచ్చగా మిగిలేది. పాక్ ఆఖరు క్షణంలో తగిన చర్య తీసుకోవడంతో ఆ దాడి తప్పింది.
అమెరికా వాసి కైత్లాన్ కోల్ మన్(31) - కెనెడా జాతీయుడైన ఆమె భర్త జాషువా బాయ్లే (34)ను పాక్ లోని హక్కానీ గ్రూప్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి ఐదేళ్ల పాటు నిర్బంధించారు. కైత్లాన్ కుటుంబాన్ని కాపాడాలని అమెరికా ఎన్నోసార్లు కోరినా పాక్ సాకులు చెప్తూ వచ్చింది. కొన్ని వారాల క్రితం హక్కానీ ఉగ్రవాదులు పాక్ లో కైత్లాన్ కుటుంబాన్ని ఒక చోటి నుంచి మరో చోటికి తరలిస్తుండగా అమెరికా నిఘా డ్రోన్ కనిపెట్టింది. దాంతో లాడెన్ ను అంతమొందించినట్లే నేవీ సీల్ కమాండోలతో దాడి నిర్వహించాలని అమెరికా సేనలు నిర్ణయించాయి. ఇందుకు ఆరుగురు కమాండోలను కూడా ఎంపిక చేసి అధ్యక్షుడు ట్రంప్ కు కూడా తెలియజేశారు. కానీ ఆఖరు నిమిషంలో అమెరికా దాడి ఆలోచనను పక్కకుపెట్టింది.
తమ పౌరురాలు - ఆయన భర్తకు సంబంధించి ఉగ్రవాదుల చెరలో ఉన్న ఉదంతం గురించి డ్రోన్ ద్వారా సేకరించిన సమాచారాన్ని పాకిస్తాన్ కు అమెరికా అందించింది. తాము ఇచ్చిన వివరాలతో వెంటనే కైత్లాన్ కుటుంబాన్ని విడిపించాలని పాక్ ను గట్టిగా కోరింది. కైత్లాన్ ఆచూకీపై అమెరికా పక్కా సమాచారం అందించడం - పైగా తనపై ఒత్తిడి పెంచడంతో పాక్ రంగంలోకి దిగక తప్పలేదు. దీంతో చివరి నిమిషంలో ఆపరేషన్ నుంచి అమెరికా వైదొలగింది.