వాళ్ల‌ని త‌గుల‌బెట్టాల‌ని కోరిన నిర్భ‌య‌

Update: 2017-05-06 16:56 GMT
దేశ‌వ్యాప్తంగానే కల‌క‌లం సృష్టించిన నిర్భ‌య అత్యాచారం ఘ‌ట‌న‌లో స‌ద‌రు అభాగ్యురాలు చివరి క్ష‌ణంలోనే వాంగ్మూలం ఇచ్చింది. త‌న‌కు జ‌రిగిన అన్యాయం గురించి పేర్కొంటూ ఘోర‌మైన నేరానికి పాల్ప‌డిన వారికి క‌ఠిన శిక్ష విధించాల‌ని కోరింది. నిర్భయ చివరి క్షణాల్లో ఆమె మరణవాంగ్మూలాన్ని రికార్డు చేసిన సబ్ డివిజన్ మేజిస్ట్రేట్ ఉషా చతుర్వేది తాజాగా ఆ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. తనపై అఘాత్యానికి పాల్పడినవారిని ఉరి తీయాలని, వారిని సజీవంగా తగులబెడితే చూడాలని ఉందని చెప్పిందని ఉషా చ‌తుర్వేది వివ‌రించారు.

ఆసుపత్రి బెడ్‌ పై నుంచి ప్రాణాలు ఉంటాయో లేదో తెలియని స్థితిలో కూడా నిర్భయం ఓపికను కూడదీసుకుని పోలీసులకు మరణ వాంగ్మూలం ఇచ్చిందని సబ్ డివిజన్ మేజిస్ట్రేట్ ఉషా చతుర్వేది గ‌ద్గ‌ద స్వ‌రంతో మీడియాకు వెల్ల‌డించారు. తన జీవితాన్ని ధ్వంసం చేసిన రేపిస్టులు తగిన మూల్యం చెల్లించుకుని తీరాలని, వారిని కేవలం ఉరితీయడమే కాదు, సజీవంగా తగులబెట్టాలని నిర్భయ తన మరణవాంగ్మూలంలో చెప్పింద‌ని ఉషా చ‌తుర్వేది వివ‌రించారు.నిర్భ‌య ఆవేద‌న‌ను చూసిన త‌న‌కు దోషుల‌కు ఉరితీత పూర్తి స‌బ‌బుగా తోచిందని స్ప‌ష్టం చేశారు.

కాగా, దుర్ఘ‌ట‌న జ‌రిగిన నాల్రోజుల‌ అనంత‌రం చకిత్స పొందుతున్న నిర్భ‌య‌ను సబ్ డివిజన్ మేజిస్ట్రేట్ ఉషా చతుర్వేది క‌లిసి ఆమె ఆవేద‌న‌ను అడిగి తెలుసుకున్నారు. బస్సులో ఆరేడుగురు ఉన్నారని, వారంతా ప్రయాణికులని అనుకున్నానని ఆమె తన మరణ వాంగ్మూలంలో చెప్పింది. కండక్టర్ బస్సు డోర్ లాక్ చేశాడని, దాంతో ఏదో జరుగుతుందని తనకు అనుమానం కలిగిందని ఆమె చెప్పింది. బస్సు డోర్ లాక్ చేసిన తర్వాత కండక్టర్ లైట్లు ఆర్పేసి తన తిడుతూ తన మిత్రుడిపై దాడి చేశాడని, మిగతావాళ్ల తనను బస్సు వెనక్కి తీసుకుని వెళ్లారని, తన దుస్తులు చింపేశారని, తనపై అత్యాచారం జరిపారని, ఇనుపరాడుతో తనను ఇ్టం వచ్చినట్లు కొట్టారని నిర్భయ చెప్పిన‌ట్లు ఉషా చ‌తుర్వేది వివ‌రించారు. తాను స్పృహ తప్పుతూ పోయానని, తనకు మెలుకువ రాగానే తనపై దాడి చేయడం ప్రారంభించారని నిర్భయ తన మరణ వాంగ్మూలంలో చెప్పింది. పట్టుకోండి - దుస్తులు చించేయండి - కొట్టండి - ఆమె బ్యాగ్ తీసుకోండి అనే మాటలు వినిపించాయని చెప్పింది. తాము మొత్తం అంధకారంలో ఉండిపోయామని, వాళ్లు నల్లగా కనిపించారని, వారి భాషను గమనిస్తే డ్రైవర్ - క్లీనర్ల లాగా కనిపించారని, తన శరీరంలోకి రాడ్ జొప్పించారని ఆమె వాపోయింద‌ని ఉషా చ‌తుర్వేది వెల్ల‌డించారు. ఇంతటి అఘాయిత్యానికి పాల్ప‌డిన వారి విష‌యంలో సుప్రీం కోర్టు వెలువ‌రించిన నిర్ణ‌యం పూర్తి స‌మంజ‌స‌మైంద‌ని స్ప‌ష్టం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News