రాజకీయాల్లో నేతల మధ్య మిత్రుత్వం - శతృత్వం శాశ్వతం కాదన్న సంగతి ఎన్నో సందర్బాలలో వెలుగు చూసింది ఇదే కోవలోకి చెందిన ఘటన తాజాగా తెలంగాణ కాంగ్రెస్ లో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల ఉన్నాయని అంటున్నారు. నిన్నటివరకు ఎడమొహం- పెడమొహంగా తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి - నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇపుడు ఏక తాటిపైకి రావడం ఇందుకు ఉదాహరణగా చెప్తున్నారు. ఈ విషయంలో సీఎల్పీ నేత జానారెడ్డి విజయం సాధించారని విశ్లేషిస్తున్నారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డికీ - కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికీ మధ్య ఎప్పటినుంచో రాజకీయవైరం కొనసాగుతోంది. ఒకే జిల్లాకు చెందిన ఈ నేతలిద్దరూ ఎప్పట్నుంచో గ్యాప్ కొనసాగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదట పొన్నాల లక్ష్మయ్యకు పీసీసీ బాధ్యతలను పార్టీ అధిష్టానం అప్పగించింది. అయితే పొన్నాల నియామకాన్ని అప్పట్లో కోమటిరెడ్డి తప్పుబట్టారు. ఆ తర్వాత ఆ బాధ్యతలను ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పగించినప్పుడు కూడా కోమటిరెడ్డి విమర్శలు గుప్పించారు. పీసీసీ అధ్యక్ష పదవి కోసం కోమటిరెడ్డి తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం దక్కలేదనీ, ఆ మంటతోనే ఆయన విమర్శలు చేశారని పార్టీ వర్గాలు గుసగుసలాడుకున్నాయి. ఇక ఆనాటినుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గాంధీభవన్ గడప తొక్కిన దాఖలాలు లేవు. పీసీసీ చీఫ్ కీ - ఆయనకీ మధ్య దూరం కూడా బాగా పెరిగింది. అవకాశం చిక్కినప్పుడల్లా కోమటిరెడ్డి బ్రదర్స్ ఉత్తమ్ పై విరుచుకుపడుతుండేవారు. అలాంటిది గత కొన్నాళ్లుగా కోమటిరెడ్డి రాజగోపాల్ సైలెంట్ అయ్యారు. ఆయన అలా నోరు కట్టేసుకున్నప్పటికీ వెంకట్ రెడ్డి మాత్రం జోరు తగ్గించలేదు. ఆ మధ్య పీసీసీ ప్రెసిడెంట్ పై ఘాటు విమర్శలు చేసి షోకాజ్ నోటీసుల వరకూ పరిస్థితి తెచ్చుకున్నారు.
ఈ వేడి కొనసాగుతుండగానే ఈ మధ్య మిర్యాలగూడ సభలో ఓ చిత్రమైన సన్నివేశం కనిపించింది. ఒకే వేదికపై దర్శనమిచ్చిన ఉత్తమ్ - కోమటిరెడ్డి బ్రదర్స్ ఒకళ్లనొకరు ఆప్యాయంగా పలుకరించు కున్నారు. ఈ పరిణామం పార్టీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. తాము చూస్తున్నది నిజమేనా అన్నట్టుగా కొందరు నేతలయితే నిశ్చేష్టులయ్యారట..! : మిర్యాలగూడ సభలో కనిపించిన ఈ సన్నివేశం వెనుక చాలా మంత్రాంగమే నడిచిందని అంటున్నారు.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి - ఉత్తమ్‌కుమార్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు పార్టీ సీనియర్ నేత జానారెడ్డి పావులు కదిపారట. ఇందులో భాగంగానే ఈ కలయిక జరిగిందనే టాక్ వినిపిస్తోంది. ఇదే సమయంలో పీసీసీ చీఫ్ నోట ఆశ్చర్యకరమైన ఓ స్టేట్ మెంట్ కూడా వెలువడిందట. తాము ఎప్పుడూ మిత్రులమే'' అంటూ వెంకట్ రెడ్డిని ఉద్దేశించి ఆయన చెప్పుకొచ్చారట..! ఈ నేపథ్యంలో... జానా చొరవ ఫలితంగా ఉప్పు- నిప్పులాంటి వీరిద్దరు చేతులు కలిపారంటూ జోరుజోరుగా కాంగ్రెస్ కార్యకర్తలు చెవులు కొరికేసుకుంటున్నారు. వీరి మాటల్లో నిజమెంతో తెలియదు గానీ, మిర్యాలగూడ సభలో మాత్రం కోమటిరెడ్డి- ఉత్తమ్ కుమార్ లు కలుసుకుని పలుకరించుకున్న దృశ్యం మాత్రం వాస్తవం. అయితే ఈ కలయిక శాశ్వతమా? తాత్కాలికమా? అన్న కోణంలో కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నకు సమాధానం కాలమే చెప్పగలదు.