గ‌డ్డం శ‌ప‌థం తీరేదెప్పుడు ఉత్త‌మ్ భ‌య్!

Update: 2019-06-06 06:14 GMT
శ‌ప‌థాలు చేయ‌టం.. వాతావ‌ర‌ణం సానుకూలంగా లేకుండా చేసిన స‌వాళ్ల‌ను లైట్ తీసుకోవ‌టం ఇప్ప‌టిత‌రం రాజ‌కీయ నేత‌ల‌కు వెన్న‌తో పెట్టిన విద్య‌. అందుకు భిన్నంగా తన నోటి నుంచి వ‌చ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు క‌మ్ న‌ల్గొండ ఎంపీ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి తీరు ఆస‌క్తిక‌రంగానే కాదు.. ప‌లువురు ఆయ‌న ప‌ట్ల సానుభూతిని వ్య‌క్తం చేస్తుంటారు. ఇవాల్టి రోజుల్లో ఈ త‌ర‌హా క‌మిట్ మెంట్ ఉన్న నేత‌లు చాలా అరుదుగా ప‌లువురు అభివ‌ర్ణిస్తుంటారు.

తెలంగాణ‌లో టీఆర్ఎస్ స‌ర్కారు గ‌ద్దె దిగే వ‌ర‌కు తాను గ‌డ్డం తీయ‌న‌ని ఉత్త‌మ్ శ‌ప‌ధం చేయ‌టం.. దానిపై గులాబీ నేత‌లు  కేసీఆర్‌.. కేటీఆర్.. క‌విత‌ల‌తో స‌హా ప‌లువురు నేత‌లు ఎట‌కారం చేసినా వాటిని ప‌ట్టించుకోకుండా.. త‌న శ‌ప‌ధం మీద‌నే ఆయ‌న ఉండిపోయారు. 2018లో జ‌రిగిన ముందస్తు ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం తాను గ‌డ్డం నుంచి విముక్తిడిని అవుతాన‌ని ఉత్త‌మ్ భావించినా అలాంటిదేమీ జ‌ర‌గ‌క‌పోవ‌టం తెలిసిందే.

రెండోసారి టీఆర్ఎస్ కు ప‌వ‌ర్ చేతికి వ‌చ్చిన నేప‌థ్యంలో ఉత్త‌మ్ గ‌డ్డం తీయ‌లేని ప‌రిస్థితి. ఇదిలా ఉంటే.. టీఆర్ ఎస్ కు షాకిస్తూ.. లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ఎంపీగా గెలిచిన ఆయ‌న‌.. త‌న‌తో పాటు మ‌రో ఇద్ద‌రు ఎంపీల్ని గెలుపొంద‌టంలో కీల‌కంగా మారారు. త‌న తాజా గెలుపుతో గ‌డ్డాన్ని తీసేందుకు వీలుగా వాద‌న వినిపించే వీలున్నా.. అందుకు భిన్నంగా తాను చెప్పిన మాట మీద‌నే నిల‌బ‌డ్డారు ఉత్త‌మ్‌. తాజాగా.. త‌న శాస‌న‌సభ స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు. ఎంపీగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌టానికి ముందు ఎమ్మెల్యే ప‌ద‌విని వ‌దులుకోవాల్సి ఉంటుంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న రాజీనామా చేశారు. హైద‌రాబాద్ నుంచి దేశ రాజ‌ధానికి ఎంపీగా ప‌య‌న‌మ‌వుతున్నా.. త‌న శ‌ప‌థంలో భాగంగా త‌న గ‌డ్డాన్ని తీయ‌కుండానే ఢిల్లీకి వెళ్లేందుకు డిసైడ్ అయ్యారు. రాష్ట్ర రాజ‌కీయాల‌కు దూరంగా జాతీయ రాజ‌కీయాల‌కు వెళుతున్న వేళ కూడా.. త‌న శ‌ప‌థాన్ని అమ‌లు చేస్తున్న ఉత్త‌మ్ క‌మిట్ మెంట్ ను అభినందించాల్సిందే.


Tags:    

Similar News