తెలంగాణ రాజకీయాల్ని ప్రభావితం చేసే అవకాశం హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం మీద ఉందన్న మాట సర్వత్రా వినిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల వేళలో అధికార టీఆర్ ఎస్ కు తగిలిన షాక్ నుంచి బయటపడటమే కాదు.. ఎవరేమన్నా తెలంగాణలో టీఆర్ ఎస్ కు తిరుగులేదన్న విషయాన్ని హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితంతో ఫ్రూవ్ చేయాలన్న పట్టుదలతో గులాబీ బ్యాచ్ ఉంది.
ఇధిలా ఉండగా.. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్ నగర్ సీటును తాము నిలుపుకోవటం ద్వారా.. తెలంగాణలో కాంగ్రెస్ బలం తగ్గలేదన్న విషయాన్ని చాటి చెప్పాలని తపిస్తోంది కాంగ్రెస్. దీంతో.. రెండుపక్షాల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఇదిలా ఉంటే.. జోరుగా సాగుతున్న ప్రచార వేళ.. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
హుజూర్ నగర్ అభ్యర్థి సైదిరెడ్డి.. రైల్వే కాంట్రాక్టర్లను బెదిరించి డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నట్లుగా తనకు ఒక రైల్వే కాంట్రాక్టర్ చెప్పినట్లుగా ఉత్తమ్ ఆరోపించారు. ఉప ఎన్నిక తర్వాత సైదిరెడ్డి కెనడాకు వెళ్లిపోవటం ఖాయమంటున్న ఉత్తమ్.. అధికార బలంలో కాంట్రాక్టర్లను భయాందోళనలకు గురి చేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నట్ులగా చెబుతున్నారు.
ఉప ఎన్నికల్లో తాము గెలిస్తే.. తమ కుటుంబానికి ప్రయోజమని ప్రచారం చేస్తున్న వైనంపై ఉత్తమ్ తీవ్రంగా మండిపడ్డారు. తమకు పిల్లలు లేరని.. నియోజకవర్గ ప్రజలే తమ కుటుంబంగా ఆయన అభివర్ణిస్తున్నారు. తమకు సంపాదన కూడా అవసరం లేదని చెబుతున్న ఉత్తమ్ మాటలకు హుజూర్ నగర్ ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారన్నది తేలాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే.