గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు ఇప్పుడంతా ఎదురు గాలే. ఈ ఎదురు గాలి ఏదో ఒక్క చోట మాత్రమే అనుకోవడానికి కూడా లేదు. జాతీయ స్థాయిలో ఆ పార్టీ ఏ మేర ఎదురు దెబ్బలు తిన్నదో... అదే స్థాయి దెబ్బలు దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ ఆ పార్టీ శాఖలకు తగిలాయి. ఓటమికి బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్షుడి హోదాలో ఉన్న రాహుల్ గాంధీ ఆ పదవికి రాజీనామా చేస్తే.. దాదాపుగా పార్టీకి సంబంధించి కీలక పదవుల్లో ఉన్న వారంతా అదే బాటలో నడుస్తున్నారు. ఏపీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ గా ఉన్న రఘువీరారెడ్డితో పాటు తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉన్న రేవంత్ రెడ్డి - పొన్నం ప్రభాకర్ లు కూడా రాజీనామాలు చేశారు. అయితే టీ పీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం పదవి దిగేందుకు ససేమిరా అంటున్నారు. ఎందుకనో గానీ... పదవి నుంచి దిగేందుకు ఉత్తమ్ నిజంగానే ససేమిరా అంటున్నారు.
కారణాలు ఏమిటన్న విషయాన్ని పక్కనపెడితే... ఉత్తమ్ టీపీసీీసీ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టి అప్పుడే నాలుగేళ్లు పూర్తి అవుతోంది. ఈ నాలుగేళ్లలో జరిగిన ప్రతి ఎన్నికలోనూ టీ కాంగ్రెెస్ కు పరాభవమే ఎదురైంది తప్పించి... ఎక్కడా పెద్దగా ఒరిగిందేమీ లేదు. జీహెచ్ ఎంసీ ఎన్నికలు - ఉప ఎన్నికలు - ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు - తాజాగా ముగిసిన సార్వత్రిక ఎన్నికలు... అన్నింటా పార్టీని ఉత్తమ్ పరాజయం బాటలోనే నడిపారు. పార్టీ ఓడించాలని ఉత్తమ్ కంకణమేమీ కట్టుకోలేదు గానీ... పార్టీని విజయతీరాలకు చేర్చే విషయంలో మాత్రం ఉత్తమ్ శక్తి చాలలేదన్న వాదన అయితే బలంగా వినిపిస్తోంది.
ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ మాదిరే... పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ ఉత్తమ్ కూడా పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తే బాగుంటుందని దాదాపుగా టీ కాంగ్ నేతలంతా ఆయనకు సూచిస్తున్నారు. కొందరు బహిరంగంగానే ఉత్తమ్ తప్పుకోవాలంటూ వ్యాఖ్యలు చేస్తున్నా... మరికొందరు ఆయనకు ఎలాగోలా తమ సూచనను చేరవేస్తున్నారు. అయితే ఎందరు ఎన్ని విధాలుగా తనను పదవి నుంచి తప్పుకోమని చెబుతున్నా... ఉత్తమ్ మాత్రం అవేవీ తన చెవికి చేరలేదన్న దిశగానే సాగుతున్నారు. మరి సీనియర్ల మాట ఉత్తమ్ ఎప్పుడు పాటిస్తారో - పీసీసీ చీఫ్ పదవికి ఎప్పుడు రాజీనామా చేస్తారో - మరో కొత్త నేత రాకతో అయినా టీ కాంగ్రెస్ ఎఫ్పుడు బలపడుతుందో కాలమే నిర్ణయించాలి.