ఏడాది తర్వాత జరిగే ఎన్నికల గురించి ఇప్పటి నుంచే ఇంత హైరానా అనిపించొచ్చు.కానీ.. దేశంలోనే అత్యధిక జనాభా.. విసీర్ణం ఉన్న రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలంటే ఆ మాత్రం హడావుడి ఉంటుంది. జాతీయ రాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేసే సత్తా ఉన్న యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి? ఎవరిది అధిక్యత? అధికారంలోకి వచ్చేది ఎవరు? లాంటి ప్రశ్నలు ఆసక్తికరం. మరి.. ఈ ప్రశ్నలకు సమాధానాలేంటన్న విషయంలోకి వెళితే.. తాజాగా ఒక సంస్థ యూపీలో ఒక సర్వే నిర్వహించింది.
ఇప్పటికిప్పుడు యూపీలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే.. ఫలితాలు ఎలా ఉంటాయన్న అంశాన్ని విశ్లేషించింది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందన్న అంశాన్ని అంచనా వేసింది. తాజా సర్వే ఫలితాల్ని చూస్తే.. అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీకి పెను ముప్పే పొంచి ఉంది. ఆ పార్టీ ఘోరంగా నష్టపోయి మూడోస్థానానికి పరిమితం కానుంది. అదే సమయంలో.. బీఎస్పీ.. బీజేపీలు పోటాపోటీగా నువ్వా? నేనా? అన్న రీతిలో తలపడతాయన్న అంశం తేలింది. ఇక.. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే.. తానేమాత్రం ప్రభావితం చేయలేనన్న విషయంలో మరోసారి తేలిపోయింది.
సార్వత్రిక ఎన్నికల్లో భారీగా సీట్లు కొల్లగొట్టిన బీజేపీ..అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆ జోరును కొనసాగించలేదని స్పష్టం కావటం గమనార్హం. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ అధిక్యతతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంతో పాటు.. గరిష్ఠ ప్రయోజనాన్ని పొందాలన్న ఆలోచనలో ఉన్న బీజేపీ ఆశలు నెరవేరేలా లేదనే చెప్పాలి. తాజాగా నిర్వహించిన సర్వే ఆధారంగా ఆయా పార్టీలకు వచ్చే సీట్లు.. ఓట్ల శాతాన్ని చూస్తే..
పార్టీ సీట్లు ఓట్ల శాతం
బీఎస్పీ 165 29.80
బీజేపీ 149 28.10
ఎస్పీ 68 22.09
కాంగ్రెస్ 8 8.11