విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తన పదునైన వ్యూహాన్ని తెర ముందుకు తీసుకువచ్చారు. ప్రకాశం జిల్లాకు చెందిన గంటా మూడున్నర దశాబ్దాలుగా విశాఖను తన వ్యాపార రాజకీయ కేంద్రంగా చేసుకుని చక్రం తిప్పుతున్నారు. ఆయనకు ఒక పేరు ఉంది. ప్రతీ ఎన్నికలూ ఒక పార్టీ అలాగే ఒక కొత్త నియోజకవర్గం అని చెబుతారు. అయితే ఏ పార్టీ మారినా ఎక్కడ పోటీ చేసినా గంటా ఎపుడూ ఓడిపోలేదు. ఆయన వేసిన అంచనా తప్పుకాలేదు.
ఇక విశాఖ నార్త్ నుంచి తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్న గంటా తానున్న టీడీపీతో అంటీ ముట్టనట్లుగానే ఉంటున్నారు.అదే టైం లో అధికార వైసీపీకి దూరం అంటున్నారు. ఇక ఆయన ఏ వైపు ఉంటారు ఏ పార్టీ నుంచి రాజకీయం చేస్తారు అన్న చర్చ అయితే ఒక వైపు జోరుగా సాగుతున్న వేళ పవన్ మెగాస్టార్ చిరంజీవి ఫోటోలను పెట్టి విశాఖ సిటీలో రంగా వర్ధంతి రోజున ఆయన భారీ ఎత్తున కాపునాడు సభను నిర్వహిస్తున్నారు.
బయటకు కాపు నాయకులు ఈ సభను నిర్వహిస్తున్నారు అని అంటున్నా దీని వెనక గంటావే ఉన్నారు అని అంతా అంటున్నారు. ఇక ఈ సభ ద్వారా అధికార విపక్ష రాజకీయ పార్టీలలో దేన్ని గంటా టార్గెట్ చేస్తారు అన్నదే చర్చగా ఉంది. పార్టీలతో సంబంధం లేకుండా కాపునాడు నిర్వహిస్తున్నామని చెబుతున్నా ఈ సభ మాత్రం రాజకీయ అజెండాను ముందుకు తెస్తుంది అని అంటున్నారు. గతంలో కూడా అనేక కాపు సమావేశాలు నిర్వహించిన గంటా ఇపుడు భారీ ఎత్తున కాపునాడు సభను పెట్టడం వెనక పూర్తిగా ఆయన మార్క్ పాలిటిస్క్ ఉందని అంటున్నారు.
గంటాకు ఏ రాజకీయ పార్టీ కూడా టికెట్ ఇవ్వడానికి నో చెప్పదు. ఆ మాటకు వస్తే టీడీపీలో ఆయనకు టికెట్ కన్ ఫర్మ్ అలాగే మంత్రి పదవి కూడా. కానీ గంటా అంతకు మించి ఆశిస్తున్నారు అని అంటున్నారు.
ఉత్తరాంధ్రా రాజకీయాన్ని ఒడిసిపట్టి మూడు జిల్లాలలో ఉన్న కాపులను ఏకత్రాటి మీదకు నడిపించి కాపుల నేతగా గంటా అవతరించాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఆ విధంగా ఆయన బలమైన ఉప ప్రాంతీయ నాయకుడిగా మారడం ద్వారా వచ్చే ఎన్నికలను ప్రభావితం చేయాలనుకుంటున్నారు అని తెలుస్తోంది.
గంటా మార్క్ పాలిటిక్స్ తో ఏ రాజకీయ పార్టీకి మూడింది, ఎవరికి ఎసరు పెడుతున్నారు అన్నదే చర్చగా ఉంది. గంటా రాజకీయం తెలుగుదేశానికి కూడా అనుకూలంగా ఉంటుందని ఎవరూ అనుకోవడంలేదు. అలాగే అధికారంలో ఉన్న వైసీపీ మీద విమర్శలు చేయకపోతే కాపునాడు సభకు అర్ధం లేదు. ఇక మిగిలింది జనసేన బీజేపీ. ఈ రెండింటిలో గంటా జనసేన వైపు మొగ్గు చూపుతారు అని అంటున్నారు. అందుకే కాపునాడు ఆహ్వాన పత్రాల మీద పవన్ మెగాస్టార్ ఫోటోలు ఉంచారని అంటున్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీలో పనిచేసి ఉత్తరాంధ్రాలో చక్రం తిప్పిన గంటా ఈసారి కూడా అదే విధంగా తన హవాను కోరుకుంటున్నారు అని తెలుస్తోంది. మొత్తానికి గంటా మార్క్ పాలిటిక్స్ తో అన్ని రాజకీయ పార్టీలు అలెర్ట్ అవుతున్నాయనే అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.