గత కొద్దికాలంగా మౌనంగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు తాజాగా మరోసారి గళం విప్పారు. తెలంగాణకాంగ్రెస్ నేతలంతా మిషన్‌కాకతీయలో చోటు చేసుకుంటున్న అక్రమాలపై దృష్టి పెడితే.. వీహెచ్ మాత్రం అందుకు భిన్నమైన అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు.
తెలంగాణ రాష్ట్ర సర్కారుపై విమర్శలు చేసేందుకు పెద్దగా ఆసక్తిని చూపని వీహెచ్.. సత్యం రామలింగరాజు చీటింగ్ కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును విచారించాలని డిమాండ్ చేశారు. రామలింగరాజుకు..చంద్రబాబుకు సంబంధం ఏమిటంటే.. సత్యం ఎదిగిందే ఎన్డీయే టైంలో కదా అంటూ లాజిక్ లేని విషయాన్ని తెరపైకి తెస్తున్నారు.
ఒకవేళ వీహెచ్ మాటల్నే సీరియస్‌గా తీసుకుంటే.. మరి ఎన్డీయే హయాంలో ఎదిగిన రామలింగరాజు.. అదే ఎన్డీయే హయాంలో జైలుశిక్ష పాలు కావటం ఏమిటి? రామలింగరాజు అండ్ కో ఎలా దెబ్బ తింది? ఎక్కడ దెబ్బ తిందీ అందరికి తెలిసిన రహస్యమే. అయినప్పటికీ సంబంధం లేని విధంగా సత్యం ఇష్యూలో చంద్రబాబును తీసుకురావటం ద్వారా.. తన మాటల్లోని విశ్వసనీయతను వీహెచ్ తనకు తానే తగ్గించుకుంటున్నారన్న భావన కలగటం ఖాయం.
ఏపీ ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేసిన వీహెచ్.. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిపైనా దృష్టి సారించారు. వెంకయ్య ఆస్తుల పైన కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మొత్తానికి అవినీతి మకిలిని వెంకయ్యకు అంటించేందుకు వీహెచ్ తొలి అడుగు వేశారన్న వాదన వినిపిస్తోంది.