కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియాగాంధీని ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారానికి తెర తీశాయి. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంత తీవ్రస్థాయిలో మండిపడిన కేటీఆర్.. సోనియాగాంధీని ఉద్దేశించి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు గరం గరంగా ఉన్నారు.
తెలంగాణ ఇచ్చింది అమ్మా కాదు బొమ్మా కాదు.. అంటూ సోనియా మీద నోరు జారిన కేటీఆర్ తీరుపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్.. నువ్వు ఎంత? నీ స్థాయి ఎంత? అంటూ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిన వీహెచ్,.. మరోసారి కేటీఆర్ కానీ నోరు జారితే ఆయన సంగతి చూస్తానని హెచ్చరించారు. మరోసారి కేటీఆర్ కానీ నోరు జారితే ఆయన ఇంటికే నేరుగా వెళ్లి.. తాడో పేడో తేల్చుకుంటానన్నారు.
సోనియాగాంధీ తెలంగాణ కానీ ఇవ్వకుంటే కేసీఆర్ దుకాణం ఎక్కడ ఉండేదన్న వీహెచ్.. కొడుకును అదుపులో పెట్టుకోవాలంటూ కేసీఆర్ కు హెచ్చరికలు జారీ చేశారు.
పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఇచ్చింది అమ్మా కాదు బొమ్మా కాదు.. ప్రజలు కోట్లాడి గుంజుకుంటే వచ్చిందే తెలంగాణ అని.. రాష్ట్రం ఇవ్వకుంటే ప్రజలు తంతారన్న ఉద్దేశంతో.. భయంతో.. విధిలేని పరిస్థితుల్లోనే ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిందంటూ కేటీఆర్ తీవ్రస్వరంతో గళం విప్పారు. దీనిపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.