సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. దాదాపుగా అన్ని ప్రధాన ఎగ్జిట్ పోల్స్ సంస్థల సర్వేల ఫలితాలు ఎన్డీయేకు అనుకూలంగా వచ్చాయి. ఎన్డీయే కూటమే వరుసగా రెండోసారి అధికారం చేపట్టబోతున్నట్టుగా ప్రకటించాయి. నరేంద్రమోడీ మరోసారి ప్రధానమంత్రి కాబోతున్నారని అంచనా వేశాయి. అయితే, గతం కంటే ఈసారి బీజేపీ బలం 30 నుంచి 40 సీట్లు తక్కువగా ఉండొచ్చని పలు సర్వేలు అంచనా వేశాయి.
2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఒక్కపార్టీనే 282 సీట్లు గెల్చుకుంది. కొన్నేళ్ల తర్వాత.. సింగిల్ గా మెజారిటీని సాధించిన పార్టీగా రికార్డులకెక్కింది. ఎన్డీఏ కూటమి పార్టీలతో కలిపి.. 336 సీట్ల బలం బీజేపీకి ఉండేది. అయితే, ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావొచ్చన్న అభిప్రాయాల నేపథ్యంలో..తెలుగుదేశం పార్టీ స్పందన ఏంటనేది అన్నివర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు - టీడీపీ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ - ఎగ్జిట్ పోల్స్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. అవి నిజం కావచ్చని లేదా అబద్ధం కావచ్చని.. వాటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం లేదన్నారు.
ఈ సందర్భంగా టీడీపీ నేతలు ప్రధాని మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈసీ తీరు రాజ్యంగ విరుద్ధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీకి ఈసీ క్లీన్ చీట్ ఇవ్వడం వివక్షతకు పరాకాష్ట అని విమర్శించారు. సాక్షాత్తూ కేంద్ర ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసానే తమ మాటకు విలువ లేదని తెలపడం.. మోడీ నిరంకుశ పాలనకు అద్దం లాంటిదన్నారు. ఈసీని వెంటనే ప్రక్షాళన చేయాలని యనమల - వర్లరామయ్య కోరారు.