కోడెల గాలి తీసేలా మాట్లాడిన వర్ల!

Update: 2019-08-22 07:59 GMT
రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రత్యర్థులు టార్గెట్ చేయటం ఎప్పుడూ ఉండేదే. కానీ.. అందుకు భిన్నంగా సొంత పార్టీ నేతలు ఘాటు విమర్శలు చేయటం చాలా అరుదుగా తప్పించి అన్నిసందర్భాల్లో చోటు చేసుకుంది. తాజాగా ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా వ్యవహరించిన సమయంలో హైదరాబాద్ నుంచి అమరావతికి షిఫ్ట్ అయ్యే సమయంలో కొంత ఫర్నీచర్ ను తన ఇంట్లో ఉంచుకున్న ఎపిసోడ్ లో కోడెల ఇమేజ్ భారీగా డ్యామేజ్ అయ్యింది.

ఈ అంశంపై చివరకు కోడెల సైతం తన తప్పును ఒప్పుకోవాల్సి వచ్చింది. అధికారులు తన ఇంట్లో కొంత ఫర్నీచర్ ను ఉంచిన మాట వాస్తవమే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో కోడెల మీద ప్రత్యర్థులే కాదు సొంత పార్టీకి చెందిన నేతలు సైతం తెగ తప్పు పట్టేస్తున్నారు. అసెంబ్లీ ఫర్నీచర్ ను తన ఇంటికి తరలించుకోవటం ఏ మాత్రం సరికాదని వర్ల రామయ్య తప్పు పట్టారు.

కోడెల కారణంగా పార్టీ ప్రతిష్ట మసకబారిందన్నవర్ల.. అప్పుడు ఫర్నీచర్ తీసుకెళ్లి ఇప్పుడు తిరిగి తీసుకెళ్లండంటూ అనటంలో సరికాదన్న ఆయన.. ఫర్నీచర్ ను తాను ఇంటికి తీసుకెళుతున్న విషయాన్ని అసెంబ్లీ వ్యవహారాల కార్యదర్శికి కూడా ఎందుకు చెప్పలేదని సూటి ప్రశ్నను సంధించారు.

కోడెల ఈ పని చేయకుండా ఉంటే బాగుంటుందన్న ఆయన.. మాజీ స్పీకర్ తీరును తప్పు పట్టారు. ఇప్పటివరకూ అసెంబ్లీ ఫర్నీచర్ ను తన ఇంట్లో ఉంచుకున్న ఎపిసోడ్ లో కోడెలను రాజకీయ ప్రత్యర్థులు టార్గెట్ చేసినా.. సొంత పార్టీ నేతల నుంచి ఎలాంటి విమర్శ ఎదురుకాలేదు. ఆ లోటును తీర్చేలా వర్ల రామయ్య మండిపాటు పార్టీలో ఇప్పుడు కలకలం రేపుతోంది.

ఇక.. ఏపీ అసెంబ్లీకి సంబంధించిన ఏ ఫర్నీచర్ ను కోడెల తన నివాసానికి తరలించుకున్నారన్న విషయంలోకి వెళితే.. ఆసక్తికర రీతిలో ఒక భారీ జాబితా ఒకటి వైరల్ అవుతోంది. ఈ లెక్క చూస్తే.. ఆశ్చర్యంతో అవాక్కు అవ్వాల్సిందే.

%  ప్లాస్టిక్ చైర్స్ – 27
%  బీఏసీ హాల్ చైర్స్ – 8
%  డైనింగ్ హాల్ చైర్స్ – 7
%  ఎగ్జిక్యూటివ్ చైర్స్ – 2
%  సింగిల్ సీటర్ సోఫాలు – 3
%  త్రీ సీటర్ సోఫా – 1
%   డైనింగ్ టేబుల్ – 1
%  బీఏసీ మీటింగ్ టేబుల్ – 1
%  సెంటర్ టేబుల్ – 1
%  చైర్స్ – 5
%  విజిటర్స్ చైర్స్ – 5
%  విజిటర్స్ చైర్స్ (పీకాక్ మోడల్ )- 14
%   మెంబర్స్ లాండ్ చైర్స్ – 80
%  మెంబర్స్ లాంజ్ ఉడెన్ చైర్స్ – 10
Tags:    

Similar News