అవి చంద్రబాబు-కేసీఆర్ లు సన్నిహితంగా ఉన్న రోజులు. ఉమ్మడి హైదరాబాద్ రాజధాని నుంచి ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబును ‘ఓటుకు నోటు’ కేసుతో సాగనంపిన కేసీఆర్ ఆ తర్వాత చంద్రబాబుతో కయ్యానికి కాలుదువ్వాడు. కానీ అమరావతి రాజధాని శంకుస్థాపన మళ్లీ ఈ గురు శిష్యులను కలిపింది. ఆ తర్వాత కేసీఆర్ నిర్వహించిన చండీయాగానికి కేసీఆర్ అమరావతిలోని ఉండవల్లి చంద్రబాబు నివాసానికి హెలీక్యాప్టర్ లో వచ్చారు. బాబును చండీయాగానికి ఆహ్వానించారు. లంచ్ చేశారు. పాత విషయాలు మాట్లాడుకొని హెలీక్యాప్టర్ లో వెళ్లబోయాడు.
అయితే కేసీఆర్ ను సాగనంపేందుకు వచ్చిన పలువురు టీడీపీ మంత్రులు, నేతలతో పిచ్చాపాటిగా మాట్లాడారట. కేసీఆర్ ఉంటున్న ఉండవల్లి ‘లింగమనేని గెస్ట్ హౌస్’ వాస్తు ప్రకారం లేదని.. ఇక్కడ పెద్ద గుంట ఉందని.. ఇది అంతమంచిది కాదని.. అనర్థాలు జరుగుతాయని.. చంద్రబాబు ఇక్కడ ఎందుకు ఉంటున్నారు.?’ అని ప్రశ్నించారు.
వాస్తు, జ్యోతిష్యాలను బాగా నమ్మే కేసీఆర్ కు అధికార యోగం వాటివల్లే సాధ్యమని పూజలు, పునస్కారాలు, శాంతి హోమాలు, యాగాలు చేస్తుంటారు. ఇక ఉమ్మడి ఏపీ సీఎం అధికారిక నివాసమైన బేగంపేట సీఎం క్యాంప్ ఆఫీస్ ను ఆయన వాస్తు సరిగా లేదని కాలదన్ని ప్రగతి భవన్ ను నిర్మించుకున్నారు. ఇక వాస్తు లేదని సెక్రెటేరియట్ కు కూడా వెళ్లడం లేదు. ఇప్పుడు కొత్త సెక్రెటేరియట్ ను నిర్మిస్తున్నారు.
ఇలా వాస్తుపై బాగా పట్టున్న కేసీఆర్.. చంద్రబాబు ప్రస్తుతం ఉంటున్న ‘లింగమనేని గెస్ట్ హౌస్ ’ వాస్తు సరిగా లేదని.. దీనివల్ల అపజయాలు ఎదురవుతాయని ముందే హెచ్చరించాడట. కానీ ఇలాంటి నమ్మకాలు లేని బాబు ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోయాడు. అయితే వాస్తే గెలిపిస్తుందని మేం చెప్పడం లేదు కానీ.. బాబు ఓటమికి కారణాలపై విశ్లేషణలో భాగంగా నాటి కేసీఆర్ మాటలను ఇప్పుడు బాబు చెవిలో వేశారట టీడీపీ సీనియర్లు. సో ఇప్పటికైనా ఉండవల్లి ఇంటిని జగన్ కూలగొట్టకముందే ఖాళీ చేస్తే బెటర్ అని సూచించారట.. సో బాబు ‘కొంప’ కొల్లేరు వెనుక కేసీఆర్ ముందస్తు హెచ్చరికల విషయం తాజాగా బయటపడింది.