శాసన రాజధానిగా ప్రస్తుతం రాజధానిగా ఉన్న అమరావతిని కొనసాగిస్తూనే కార్య నిర్వాహక రాజధానిగా విశాఖపట్టణం - న్యాయ రాజధానిగా కర్నూల్ ను చేయాలని ఏపీ సీఎం జగన్ నిర్ణయించారు. అందుకనుగుణంగా ప్రస్తుతం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు ఏపీ రాజధానిగా కొనసాగిన అమరావతిలో ఉన్న కార్యాలయాలు - సంస్థలు త్వరలోనే ఆయా ప్రాంతాలకు తరలివెళ్లనున్నాయి. అలా వెళ్లిపోయే వాటిలో సచివాలయం కూడా ఒకటి.
అమరావతి శాసన రాజధానిగా నిర్ణయించడంతో ప్రస్తుతం అసెంబ్లీ - శాసనమండలి మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఇక ఉన్న హైకోర్టు కర్నూలుకు - సచివాలయం విశాఖకు తరలి వెళ్లనుంది. అయితే ఆ కార్యాలయన్నీ వెళ్లితే ప్రస్తుతం ఆ కార్యాలయాలుగా కొనసాగిన భవనాలు ఖాళీ అవుతాయి. మరీ ఆ ఖాళీ అయిన ఆ భవనాలను ఏం చేయాలని ప్రభుత్వం ఆలోచించింది. అధికారులతో కలిసి చర్చించారు. ఆ భవనాలను ప్రజాప్రయోజన కార్యకలాపాలకు - సంస్థలకు కేటాయించేందుకు జగన్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా సచివాలయం భవనాన్ని మల్టీ స్పెషాలటీ ఆస్పత్రిగా తీర్చిదిద్దాలని సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గుంటూరు - కృష్ణ జిల్లావాసులకు ప్రభుత్వం వైద్యం అందుబాటులో ఉండేలా ఆస్పత్రి ఏర్పాటుచేయాలని భావిస్తున్నారంట.
ఇక మిగతా హైకోర్టు - ఎమ్మెల్యేలు - అధికారుల నివాస సముదాయాలు కూడా ఇతర శాఖలకు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. మిగిలే భవనాలన్నీ ఆచార నాగార్జున విశ్వవిద్యాలయానికి కేటాయించాలని ఆలోచిస్తున్నారు. విశ్వవిద్యాలయ కళా భవనంగా - వైస్ చాన్సలర్ నివాసం - ఉద్యోగ నివాస సముదాయాలు - విశ్వవిద్యాలయ అధికారుల నివాసాలుగా మార్చే అవకాశం కనిపిస్తోంది. అయితే అసెంబ్లీ భవనాన్ని కూడా మార్చేసేటట్టు అధికార వర్గాల్ల చర్చ సాగుతోంది. ప్రస్తుతం అసెంబ్లీని వదిలేసి కొత్తగా జాతీయ రహదారికి సమీపంలో అధునాతనమైన భవనాన్ని నిర్మించే యోచనలో ఉన్నారు.
ఇదే జరిగితే ప్రస్తుత అమరావతి ప్రాంతంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి సంబంధించిన కార్యాలయాలు మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఇక ప్రస్తుత సచివాలయ భవనం, వివిధ విభాగాధిపతుల భవనాలు అన్నీ కలిపి పేద్ద మల్టీస్పెషాలిటీగా చేయాలని నిర్ణయం తీసుకున్నారట. ఆస్పత్రిగా మారిస్తే సమీప ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే వీటిపై త్వరలోనే అధికారికంగా నిర్ణయం వెలువడనుంది.