అన్ని పట్టించుకోవటానికి కేంద్రానికి పని లేదా?

Update: 2015-06-24 09:27 GMT
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడికి చిరాకు వచ్చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నిత్యం ఏదో ఒక పంచాయితీ తెర మీదకు రావటం.. దాని మీద ప్రశ్నల మీద.. ప్రశ్నలు మీదకు వచ్చేయటం.. వాటికి సమాధానం చెప్పటం చిరాకు పుట్టినట్లుంది.

కేంద్రమంత్రి హోదాలో ఉండి కూడా నిత్యం  గల్లీ పంచాయితీలేందన్నట్లుగా ఆయన తాజా వ్యాఖ్యలుఉన్నాయి.  ఫలానా అన్న అంశాన్ని ప్రస్తావించకుండా.. కేంద్రం నిత్యం ప్రతి విషయాన్ని పట్టించుకోదని చెప్పారు. ఏదైనా సమస్య పరిష్కారం కోసం ఆయా రాష్ట్రాలు కేంద్రాన్ని కోరితేనే పరిశీలిస్తామని తేల్చారు.

అన్ని విషయాల్ని కేంద్రం పట్టించుకోదని చెప్పిన ఆయన.. స్మార్ట్‌సిటీలు.. అమృత్‌ సిటీల ఎంపికలో ఎలాంటి రాజకీయం లేదన్నారు. 40 ఏళ్ల కిందట చోటు చేసుకున్న ఎమెర్జెన్సీ గుర్తు చేసుకున్న ఆయన.. ఆ ఘటన తన జీవితాన్ని మార్చేసిందన్నారు. ఎమెర్జెన్సీ సమయంలో ఆయన చురుకుగా పాలు పంచుకోవటంతో ఆయన రాజకీయాల పట్ల విపరీతంగా ఆకర్షితులయ్యారని చెబుతారు. మొత్తానికి.. రెండు రాష్ట్రాల మధ్య పంచాయితీలు వెంకయ్యను కాస్త చిరాకు పుట్టిస్తున్నట్లు కనిపిస్తోంది.

Tags:    

Similar News