వెంకయ్య మాటలు ప్రకృతికీ నచ్చలేదా?

Update: 2016-11-05 05:18 GMT
అవసరానికి తగ్గట్లుగా మాట్లాడటం మామూలే. రాజకీయ నాయకులు అన్న తర్వాత సమయానికి తగ్గట్లుగా తమ వాదనను మార్చేసుకునే తీరు స్పష్టంగా కనిపిస్తుంది. ఎంత మాట్లాడినా.. చెప్పే మాటల్లో ఎంతకొంత నిజాయితీ ఉండాల్సిన అవసరం ఉండాల్సిన అవసరం ఉంది. వినేవాడు ఉంటే చెప్పే వాడు చెలరేగిపోతారన్నట్లుగా ఉన్నాయి తాజాగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడి మాటలు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వకపోవటానికి కారణాల్ని అదే పనిగా ఉదరగొట్టేస్తున్న ఆయన.. తాము కానీ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హదా ఇస్తామని పార్లమెంటులో ఎలా చెప్పగలిగారన్నది ప్రశ్న.

ఇలాంటివి ఆయన్ను మీడియా సంధించదు. అందుకే కాబోలు తనకు నచ్చినట్లుగా విషయాల్ని చెప్పేస్తున్న వెంకయ్య మాటలు ప్రకృతికి కూడా ఏ మాత్రం నచ్చినట్లుగా లేదు. అందుకే.. ఆయన తన తొండి వాదనను వినిపిస్తుంటే.. భరించలేకేమో కానీ జోరు వర్షం కురిసిన పరిస్థితి. ఏపీ అభివృద్ధికి కేంద్ర సహకారం – ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ పట్ల అవగాహన పేరిట తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో శుక్రవారం సాయంత్రం కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా చెలరేగిపోయి మాట్లాడిన వెంకయ్య.. ఏపీకిప్రత్యేక హోదా ఎందుకు రాదన్న విషయాన్ని తేల్చేసిన ఆయన.. ‘‘దేశ సరిహద్దు రాష్ట్రాలు.. కొండ ప్రాంతాలు.. అడవులు.. గిరిజనులు ఎక్కువగా ఉన్నరాష్ట్రాలు.. బాగా వెనుకబడిన ఒడిశా.. బీహార్ లాంటి వెనుకబడిన రాష్ట్రాలకు మాత్రమే ప్రత్యేక హోదా అర్హత ఉంది’’ అని చెప్పుకొచ్చారు. అదే నిజమైతే.. ఇదే వెంకయ్య నాడు పార్లముంటలో మాట్లాడిన దానికేం చెబుతారన్నది ప్రధాన ప్రశ్న. వచ్చే ఐదు సంవత్సరాల్లో ఏపీకి ఏర్పడే ఆర్థిక లోటును కేంద్రం తీరుస్తుందని చెప్పిన వెంకయ్య ఆ మొత్తం రూ.22వేల కోట్లుగా చెప్పారు. ఇక.. 14వ ఆర్థిక సంఘం ద్వారా కేంద్రం రానున్న ఐదేళ్లలో రూ.2.06 లక్షల కోట్లు ఇస్తుందని వెల్లడించారు. ప్రత్యేక హోదాకు మించిన ప్యాకేజీని ఏపీతో పాటు ఒడిశా.. పశ్చిమ బెంగాల్ కు ఇవ్వనున్నట్లుగా వెల్లడించారు.

అందరికి ఇచ్చేదే ఏపీకి ఇచ్చేస్తే.. విభజన కారణంగా ఏపీకి జరిగిన అన్యాయానికి పరిహారం ఏమిటన్న విషయంపై మాట్లాడని వెంకయ్య.. ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని సాయం అడిగే విషయంలో భయపడుతున్నట్లుగా వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని కొట్టిపారేశారు. ఇదిలా ఉంటే.. వెంకయ్య ఓపక్కనాన్ స్టాప్ గా అంత్యప్రాసలతో తన ప్రసంగాన్ని అదరగొట్టేస్తున్న వేళ.. ఆయన చెప్పే మాటల్లో నిజం లేదని ఫీలైందో ఏమో కానీ ప్రకృతి కూడా స్పందించి జోరు వాన కురిపించేసింద. అయినప్పటికీ తన ప్రసంగ ప్రవాహాన్ని వెంకయ్య ఆపలేదు. ఆయన మాట్లాడుతున్నా పట్టించుకోకుండా సభకు వచ్చేసిన జనం వర్షం ధాటికి వెళ్లిపోవం స్పష్టంగా కనిపించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News