వెంకయ్య మూడో బిడ్డ గురించి తెలుసా?

Update: 2017-07-19 07:32 GMT
ఎన్డీయే తరఫున ఉప రాష్ర్టపతి పదవికి పోటీపడుతున్న వెంకయ్యనాయుడు జీవితం సుదీర్ఘకాలంగా ప్రజలతో ముడిపడి ఉంది. ఆయన పార్టీకి - రాజకీయాలకే అంకితమైపోయిన వ్యక్తి. అయితే... అదే సమయంలో కుటుంబ బాధ్యతలనూ విస్మరించలేదు. దేశమే ఆయనకు ఇల్లయిపోయినా సొంత ఇంట్లోని మనుషుల మనసులనూ గెలుచుకున్న వ్యక్తి.  వెంకయ్యనాయుడు చిన్న వయసులోనే తల్లిని కోల్పోయారు. అయితే.. ఆమె బతికి ఉన్న రోజుల్లో ఎప్పుడూ కొడుకు ఉన్నతిని గురించి కలలు కనేవారట. విమానాల్లో తిరుగుతాడు... ఊళ్లను ఏలుతాడు అని అనుకునేవారట. అనుకున్నట్లుగానే ఆయన అత్యున్నత పదవులను అలంకరించే దిశగా సాగిపోతున్నారు.
    
వెంకయ్య మైకు పట్టుకుంటే చాలు మాటలు ప్రవహిస్తాయి. ప్రాసలు పరుగులు తీస్తాయి. వేదికలపైనే కాదు ఇంట్లోనూ ఆయనది ఆదే శైలని ఆయన భార్య చెప్తున్నారు. ఇంట్లోనైనా బయటైనా ఒకేలా ఉంటారని.. ముక్కుసూటిగా ఉంటారని.. ఉన్నదున్నట్లు మాట్లాడేస్తారని.. ఆ లక్షణమంటే తనకు ఇష్టమని వెంకయ్య సతీమణి రీసెంటుగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
    
అలాగే వెంకయ్యలో తనకు నచ్చని విషయం గురించి కూడా ఆమె చెప్పుకొచ్చారు. ఒక్కోసారి ఆయనకు కోపమొస్తుందని.. ఆ కోపం తనకు నచ్చదని ఆమె తెలిపారు.  అలాగే తమ పిల్లలను ఎంతో క్రమశిక్షణతో పెంచి.. వారి విషయంలో చాలా స్ట్రిక్టుగా వ్యవహరించిన ఆయన మనవల విషయానికొచ్చేసరికి మాత్రం వారికి చాలా రిలాక్సేషన్లు ఇచ్చేస్తున్నారని... వాళ్లు ఒక్క రోజు స్కూలుకి వెళ్లబోమని చెప్పినా ఫరవాలేదులే అంటారని ఆమె సరదాగా చెప్పుకొచ్చారు.
    
తమకు ఇద్దరే సంతానమైనా వెంకయ్యకు మూడో బిడ్డ కూడా ఉందంటూ ఆమె బాంబు పేల్చారు. ఆ బిడ్డ పేరు స్వర్ణభారతి అని.. స్వర్ణ భారతి ట్రస్టును ఆయన సొంత బిడ్డలా భావిస్తారని ఆమె చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News